YSRTP పార్టీ అధినేత షర్మిల.. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విటర్ వేదికగా షర్మిల కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. చిన్నదొర కేటీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు కేసీఆర్‌పైనా తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష లీడర్లు ఎన్నికల సమయంలోనే కనిపించే సంక్రాంతి గంగిరెద్దులైతే.. ఎన్నికలకు 6 నెలల ముందు నిద్రలేచిన కుంభకర్ణుడు కేసీఆర్ అంటూ ఎద్దేవా చేస్తూ షర్మిల ట్వీట్ చేశారు. కేసీఆర్ ను మళ్లీ ఎందుకు ఆశీర్వదించాలో ఒక్క కారణం చెప్పు చిన్న దొర అంటూ కేటీఆర్‌ను నిలదీశారు. ప్రాజెక్టుల పేరు చెప్పి మీ కుటుంబం లక్ష కోట్లు కాజేసినందుకు ఆశీర్వదించాలా అని ప్రశ్నించారు.
వరి వేస్తే ఉరేనని…కౌలు రైతు రైతే కాదన్న దుర్మార్గుడు కేసీఆర్ అని షర్మిల మండిపడ్డారు. పోడు పట్టాల నుంచి మొదలు దళితబంధు వరకు మోసాలకు తెగబడ్డ గజదొంగ కేసీఆర్ అంటూ ఆరోపించారు. చేతకాని దద్దమ్మలంతా బందిపోట్ల రాష్ట్ర సమితిలోనే ఉన్నారనేది జగమెరిగిన సత్యమన్నారు. చేతకాని దద్దమ్మలను, సన్నాసులను ఆశీర్వదించడం కాదని…తన్ని తరిమి వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
తెలివిలేనోళ్లు కాంగ్రెసోళ్ళయితే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొన్న మీది అతి తెలివి కాదా చిన్న దొర..!
కాంగ్రెస్ నేతలు చేతకాని దద్దమ్మలు అయితే 2014 లో 6గురిని కొన్న మీరు పెద్ద దద్దమ్మలు కారా..?
చేతకాని సన్నాసులే అయితే 2018 లో 12మందిని కొన్నందుకు మీరు పెద్ద సన్నాసులు కారా..?…
— YS Sharmila (@realyssharmila) June 8, 2023