రాష్ట్రంలోని కరెంటు కోతలపై అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వెంటనే వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
” కెసిఆర్ దొర అసెంబ్లీ వేదికగా 24 గంటల కరెంటు పై పచ్చి అబద్దాలు చెబుతున్నాడు. ఒక పక్క కరెంటు కోతలపై రైతుల ఫోన్లకే మెసేజ్లు వస్తుంటే.. పొలాలు ఎండిపోతున్నాయని రైతులు సబ్ స్టేషన్ ల ఎదుట చేస్తున్న ఆందోళనలు దొరకు కనిపించడం లేదు. వెంటనే వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఏడు గంటలకు కూడా కరెంటు ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరా లేక ఎండిపోతున్న, రైతుల విలవిల. స్వరాష్ట్రంలో 24 గంటల కరెంటుకు దిక్కులేదు కానీ దేశమంతా ఇస్తాడట. వైయస్సార్ తెలంగాణ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది” అని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.