తెలంగాణ చేనేత, జౌళీ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్‌… పూర్తి వివరాలివే…!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని తెలంగాణ చేనేత, జౌళీ శాఖ కార్యాలయం పలు పోస్టులని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు.

ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని తెలంగాణ చేనేత, జౌళీ శాఖ కార్యాలయం లో ఒప్పంద ప్రాతిపదికన 15 క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా వున్నాయి. డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్యాస్ అయినవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. అలానే చేనేత రంగం లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి చూసుకోండి.

అలానే ఎంఎస్‌ వర్డ్‌/ఎక్సెల్‌/పవర్‌పాయింట్‌ వచ్చి ఉండాలి. నోటిఫికేషన్‌ వెలువడిన 21 రోజుల్లోపు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపచ్చు. ఇక సెలెక్షన్ ప్రాసెస్ లోకి వెళితే.. విద్యార్హతలు, అనుభవం, స్థానికత, వయోపరిమితి చూసి ఎంపిక చేస్తారు. సాలరీ విషయానికి వస్తే నెలకు రూ.24,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చూడచ్చు.

దరఖాస్తు చిరునామా:
The Commissioner of Handlooms & Textiles & AEPs, 3rd Floor, Chenetha Bhavan, Nampally, Hyderabad-500 001, Telangana State.

 

Read more RELATED
Recommended to you

Latest news