వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. అలానే వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి ప్రేమికులకు సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ప్రేమికులు కూడా కొన్ని చిట్కాలు అని పాటించాలి. చక్కగా ఆనందంగా ప్రేమగా ఉండాలంటే పండితుల చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలను మరి చూసేయండి. మీరు కనుక వీటిని ఫాలో అయితే మీ ప్రేమలో ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండొచ్చు. కలకాలం కలిసి ఉండొచ్చు. మరి ఇంక పండితులు చెప్పిన విషయాలను చూద్దాం.
వాస్తు ప్రకారం ఇంట్లో రెండు పక్షుల ఉన్న ఫోటోలని పెట్టడం మంచిది నైరుతి వైపు ఇది పెట్టుకుంటే మరీ మంచిది.
మీరు నిద్రపోతున్న గదిలో మంచి వెలుతురు ఉండాలి.
ప్రియుడికి కానీ ప్రేయసికి కానీ బహుమతులని ఇస్తున్నట్లయితే నలుపు రంగు ఉండే వాటిని ఇవ్వొద్దు ఇవి సమస్యలు కలిగిస్తాయి అలానే నీలం రంగు వాటిని కూడా ఇవ్వకండి. మీరు ఏమైనా బహుమతిని ఇచ్చేటప్పుడు పసుపు, ఎరుపు, పింక్ కలర్స్ వాటిని ఇవ్వొచ్చు ఇలా ఈ విధంగా మీరు ఫాలో అయితే కచ్చితంగా మీ రిలేషన్షిప్ బాగుంటుంది సమస్యలు ఉంటావు.