తెలంగాణ ఆఫ్ఘనిస్తాన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తాలిబన్లు – వైఎస్‌ షర్మిల

తెలంగాణ ఆఫ్ఘనిస్తాన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తాలిబన్లు అంటూ వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులను బెదిరిస్తున్నారు,ఇది ప్రజాస్వామ్యమా,మనం ఆఫ్ఘసిస్తాన్ లో ఉన్నామా,రైతులను బెదిరించడానికి.. మీరు తాలిబన్లా అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని చేపట్టిన ధర్నాలో వైయస్ షర్మిల ఈ కామెంట్స్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను వెన్నుపోటు పొడిచాడని.. ఈ రోజు రాష్ట్రంలోని ప్రతి పైసా సంపద తెలంగాణ ప్రజలదేనన్నారు. తెలంగాణ ప్రజల నెత్తిన కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల అప్పు పెట్టాడని.. కమీషన్ ల రూపంలో తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుతింటున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు రైతులు నిరసన తెలిపక పోతే రైతు బంధు కట్ చేస్తానన్నాడు తన ఇంట్లో సొమ్ము ఇవ్వడం లేదని… కేంద్రం పెట్రోల్, డీజల్ ధరలు పెంచితే రాష్ట్రం కూడా నిత్యావసర వస్తువుల ధరలు,విద్యుత్ ధరలు పెంచిందని పేర్కొన్నారు.