తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి కి నోటీసులు

-

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు అకాడమీ నిధుల గోల్‌ మాల్‌ కేసులో సంచలన సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ తెలుగు అకాడమీ నిధుల గోల్‌ మాల్‌ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి కి నోటీసులు జారీ చేసారు సీసీఎస్ పోలీసులు. తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి ఇవాళ విచారణ కు హాజరు కావాలని అకౌంట్స్ అధికారి రమేష్ కు సమాచారం ఇచ్చారు సీసీఎస్ పోలీసులు.

అకాడమీ ఉద్యోగులందరిని విచారణ కోసం హిమాయత్నగర్ లోని అకాడమీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు సీపీఎస్ పోలీసులు. ప్రధాన నిందితులు మస్తాన్ వలి, రాజ్ కుమార్ తో అధికారుల సంబంధాలను ఆరా తీయనున్నారు సీపీఎస్ పోలీసులు… ఔట్ సౌర్చింగ్ ఉద్యోగి రఫీ తో ఆర్థిక లావాదేవీలు ఎందుకు జరిపించారని ఈ సందర్భంగా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక తెలుగు అకాడమీ డైరెక్టర్ పదవి నుంచి.. రెండు రోజుల కిందటే సోమిరెడ్డిని తొలగించారు. సోమిరెడ్డి స్థానం లో సీనియర్ అధికారి దేవసేనను తెలుగు అకాడమీ డైరెక్టర్ గా నియామకం చేసింది తెలంగాణ సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news