డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్

-

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ముంబై డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. శనివారం అర్థరాత్రి పక్కా సమాచారంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోొ (NCB) దాడులు నిర్వహించారు. ముంబై సమీపంలో అరేబియా సముద్రం మధ్యలో ఉన్న క్రూయిజ్ షిప్ పై దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు NCB అధికారులు. రేవ్ పార్టీ కోసం సదరు క్రూయిజ్ షిప్ ను మూడు రోజులకు అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. దాదాపుగా 7 గంటల పాటు జరిగిన ఈభారీ ఆపరేషన్ లో అతిపెద్ద డ్రగ్స్ కుట్రను బట్టబయలు చేశారు. ఆర్యన్ ఖాన్ తోపాటు ముంబైకి చెందిన పలువురు సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తల పిల్లలు డ్రగ్స్ దాడుల్లో పట్టుబడ్డారు. ఈఘటనతో దేశంతో పాటు బాలీవుడ్ ఉలిక్కిపడింది. మొదటగా ఆర్యన్ ఖాన్ ఫోన్ ను సీజ్ చేసిన అధికారులు అతన్ని ప్రశ్నించి ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఈడ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణ జరగుతోంది. డ్రగ్స్ పెడ్లర్లతో ఆర్యన్ ఖాన్ కు సంబంధాలు ఉన్నాయని ప్రాథమిక సమాచారం.  ముగ్గురు మహిళలతో పాటు 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్యన్ తోపాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news