హుజురాబాద్ నియోజకవర్గం ఉపఎన్నిక పోరు సిద్ధమైన సంగతి తెలిసిందే. హుజురాబాద్ నియోజక వర్గాన్ని దక్కించుకోవడానికి అన్ని పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెరాస కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఈరోజు ఉదయం కేసీఆర్ సమక్షంలో మంత్రులు, ఎమ్మేల్యేలతో సమావేశం జరగనున్నట్లు సమాచారం.
గతంలో ప్రచారంలోకి వచ్చినట్టు టీడీపీలో ఉండి టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎల్ రమణ, కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన కౌశక్ రెడ్డిల పేర్లు కాకుండా గెల్లు శ్రీనివాస్ ని హుజురాబాద్ ఉపఎన్నిక అభ్యర్థిగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో దాదాపుగా నిర్ణయం తీసేసుకుందని కేవలం ప్రకటించడమే ఆలస్యం అన్నట్లుగా ఉంది. మరి కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ఈరోజుతో హుజురాబాద్ అభర్థిని ప్రకటించడంలో ఉన్న సంశయం తొలగిపోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.