తెలుగు హీరోలు పెళ్లి చేసుకోకుండా ముదురు బెండకాయలు గా తయారవుతూ ఉన్నారు. ఇక ఎప్పుడైనా ఇంటర్వ్యూ లో పెళ్లి గురించి అడిగితే చాలు నా కా ఇప్పుడేనా అంటూ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. ఇక మన చిలిపి బాలయ్య మాత్రం వచ్చిన యంగ్ హీరోలను ముందు పెళ్లి గురించే అడుగుతూ ఇంకా ఎన్ని రోజులు అంటూ ఇన్ డైరక్ట్ గా పంచ్ వేస్తున్నాడు.
బాలయ్య ఆహా షో లో శర్వా పెళ్లి గురించి అడిగితే ప్రభాస్ చేసుకున్న తర్వాత అంటూ తన మీదకు నెట్టాడు. ప్రభాస్ ను ఇదే విషయం గురించి అడిగితే అతను సల్మాన్ ఖాన్ మీద పెట్టాడు. ఇక సల్మాన్ ఖాన్ వచ్చి ఉంటే ఆయన రాహుల్ గాంధీ మీదకు నెట్టే వాడు. అది ఇప్పట్లో సాధ్యం కాదు లేండి. కాక పోతే శర్వానంద్ పెళ్ళికి లొంగి పోయాడని తెలుస్తోంది.
శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి గురించి ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. ఆమె ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మాజీ మంత్రికి మనుమరాలు అని కూడా తెలుస్తోంది. ఇక 38 ఏండ్ల వయస్సున శర్వానంద్ పెళ్లి కుదిరిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.