వర్క్ చేయడానికే మన టైమ్ అంతా పోతుంది..ఇంకా ఎక్సర్‌సైజ్‌లు చేసే టైమ్ ఎక్కడ ఉంటుంది. మనసులో ఉంటుంది జిమ్‌కు వెళ్లాలని లేదా ఇంట్లోనో ఒక అరగంట వ్యాయామం చేయాలని..కానీ టైమ్ కుదరడం లేదు..బిజీ లైఫ్‌లో బోలెడు పనులు.. మీరు కూడా ఇలానే అనుకుంటున్నారా..? అయితే వర్క్ చేసేప్పుడే వ్యాయామం చేయొచ్చు.. ఎలా అనుకుంటున్నారా..? ఫిట్నెస్‌ను, ఎలక్ట్రానిక్ డివైజ్‌లను కలుపుతూ ఏసర్ (Acer) కంపెనీ ఇకైనెక్ట్ బీడీ3 బైక్ లాంచ్ చేసింది. దీని ద్వారా పని చేసుకుంటూనే వ్యాయామాలు చేయొచ్చు.. ఈ బైక్ పెడల్స్ తొక్కేటప్పుడు ప్రొడ్యూస్ అయ్యే విద్యుత్‌తో ల్యాప్‌టాప్, ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ ప్రొడెక్ట్ వివరాలు ఏంటో చూద్దామా..!
ఏసర్ ఇకైనెక్ట్ బీడీ3..
ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం కోసం ఏసర్ కొత్త eKinekt BD3 బైక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కంపెనీ ఫిట్నెస్ బైక్ , స్మార్ట్ డిస్క్ కాన్సెప్ట్‌లను కలిపి కొత్త రకం డెస్క్ బైక్‌ను రూపొందించింది. ఈ డివైజ్ గురించి లాస్ వేగాస్‌లోని CESలో 2023 ప్రారంభంలో ప్రకటించింది. దీన్ని వాడే యూజర్లు తమ ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ఛార్జింగ్ చేసుకోవడానికి అవసరమయ్యే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని పేర్కొంది. ఇది పెలోటాన్ బైక్, స్మార్ట్ డెస్క్ రెండిటి కాంబినేషన్.. eKinekt BD3 బైక్ పెడల్స్ తొక్కినప్పుడు అది కైనెటిక్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒక రైడర్ బైక్ డెస్క్‌పై నిమిషానికి 60 రోటేషన్లతో ఒక గంట పాటు స్థిరంగా సైక్లింగ్ చేస్తే దాని నుంచి 75 వాట్ల పవర్ ఉత్పత్తి అవుతుందట..
స్మార్ట్‌ఫోన్‌తో ట్రాకింగ్
ఈ బైక్‌లో LCD డిస్‌ప్లే ఫీచర్‌తో పాటు అదనంగా స్మార్ట్‌ఫోన్ యాప్ కూడా ఉంటుంది.. ఈ యాప్ ఉపయోగించి డివైజ్ పనితీరును, రోజువారీ పురోగతిని కూడా తెలుసుకునే వీలుంది.. పెడల్స్‌ను ఎంత దూరం తొక్కారు, ఎంత వేగంతో తొక్కారు, ఎన్ని కేలరీల బర్న్ చేశారనే పూర్తి వివరాలు అందిస్తుంది. అలాగే దీని ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ వివరాలు కూడా తెలుపుతుంది. దీని ట్రాక్ చేయడం ద్వారా వినియోగదారులు తమ పనితీరును ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
రెండు విధాలుగా..
వినియోగదారులు ఈ బైక్‌ను టూ మోడ్స్‌లో ఉపయోగించవచ్చు. ఒకటి వర్కింగ్ మోడ్, రెండోది స్పోర్ట్స్ మోడ్. వర్కింగ్ మోడ్‌లో డెస్క్‌ని కుర్చీకి దగ్గరగా ఉంచుతుంది. దీంతో వినియోగదారులు టైప్ చేసుకోవచ్చు, పెడల్ చేస్తున్నప్పుడు నిటారుగా కూర్చోవచ్చు. స్పోర్ట్స్ మోడ్‌లో డెస్క్‌టాప్ మరింత ముందుకు వస్తుంది. దీని ద్వారా అదనంగా లెగ్ స్పేస్ ఉపయోగించుకోవచ్చు.
eKinekt టేబుల్ ఎత్తును, సీటును సౌకర్యంగా అడ్జస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది.. దీనికి అదనంగా బైక్ రెసిస్టెన్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. eKinektలోని డెస్క్, ప్రొడక్షన్ కవర్‌ని పోస్ట్-కన్స్యూమర్ రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేసినట్లుగా ఏసర్ చెప్పింది. Acer eKinekt BD3 జూన్ నెల నుంచి నార్త్ అమెరికా, యూరప్ దేశాలలో అందుబాటులో ఉంటుంది. దీని ధర $999, EUR 999గా ఉంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల కోసం.. ఈ బైక్‌లను కొనుగోలు చేశాయి.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇది మంచి ఎంపిక..