కోలీవుడ్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన తెలుగు నిర్మాతలు.!

-

సంక్రాంతి పండుగను తెలుగు ప్రాంతాలలో భారీ ఎత్తున జరుపుతారు. పండుగ జరిగే రోజుల్లో ఎంత చెత్త సినిమా వున్న, అది మంచి థియేటర్ కాకపోయినా హౌస్ ఫుల్ అవుతుంది. అందుకే హీరోలు సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో వుండాలని కోరుకుంటారు. ఇప్పుడు సంక్రాంతికి పోటీ , పోటీ మామూలుగా లేదు. ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలయ్య వీర సింహ రెడ్డి సినిమాల మధ్య  థియేటర్స్ కోసం గోల గోల గా ఉంది.

ఇప్పుడు దిల్ రాజు హీరో విజయ్ తో తమిళం లో నిర్మిస్తున్న వారిసు ను తెలుగు లో వారసుడు గా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.మరో ప్రక్క సంక్రాంతి, దసరా పండగ సమయాల్లో తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత అనువాద చిత్రాలకు థియేటర్స్‌ కేటాయించాలన్నట్లుగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ నోట్‌ను రిలీజ్‌ చేసింది. ఈ విషయంపై కొందరు తమిళ దర్శక-నిర్మాతలు కోపంగా ఉన్నారు.

ఇక ఈ విషయంపై లింగుస్వామి మాట్లాడుతూ.. వారిసు చిత్రానికి తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రాలలో థియేటర్స్ దొరకకపోతే తెలుగు సినిమా అనేక రకాలుగా చాలా ఇబ్బందిపడాల్సి వస్తుందని అన్నారు. ఇది విన్న చాలా మంది నిర్మాతలు తమిళ పరిశ్రమ, తెలుగు ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంది తప్ప, తెలుగు పరిశ్రమ మీ మీమీద ఆధారపడి లేదని గట్టిగానే జవాబు ఇచ్చారట. ఇప్పటికే రజని కాంత్, కమల్ హాసన్,సూర్య , కార్తీ వంటి చాలా మంది హీరోలకు తెలుగు మార్కెట్ లో వసూళ్ళు సాధిస్తున్నారు. అదే తెలుగు లో ఒక్క బాహుబలి తప్ప మిగిలిన హీరోలు ఎవ్వరూ అక్కడి మార్కెట్ లో పాగా వేయలేదని వ్యాఖ్యానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news