అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండించిన తెలుగు లఘుచిత్రం.. కన్నడంలో రిలీజ్..

-

మనసానమః పేరుతో తెరకెక్కిన తెలుగు షార్ట్ ఫిలిమ్ అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండించింది. వందల కొద్దీ అవార్డులు గెలుచుకున్న ఈ షార్ట్ ఫిలిమ్, ప్రేమ కథాంశంతో రూపొందింది. రొమాంటిక్ లవ్ డ్రామాగా బ్రేకప్ లని చాలా అందంగా చూపిస్తూ తెరకెక్కిన ఈ లఘుచిత్రంలో కథ కంటే కథనం చాలా గొప్పదిగా ఉంది. చాలా సాధారణమైన కథని, ఇంకా చెప్పాలంటే షార్ట్ ఫిలిమ్ అంటే, బ్రేకప్ కథనే తీసుకునే వారందరిలోకి భిన్నంగా ఆలోచించి, బ్రేకప్ కథాంశాన్నే చాలా అందంగా చూపించిన లఘుచిత్రమిది.

మనసానమః లఘుచిత్రంలో అందరినీ బాగా ఆకర్షించిన అంశం ఒకటుంది. రివర్స్ షాట్లతో దర్శకుడు చూపించిన ప్రతిభ నిజంగా అభినందించదగ్గది. ఇప్పటికీ అవార్డుల మీద అవార్డులు గెలుచుకుంటున్న ఈ లఘుచిత్రం తమిళంలో అనువాదమైంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ లఘు చిత్రాన్ని తమిళంలోకి అనువదింపజేసాడు. ప్రస్తుతం షార్ట్, కన్నడ ప్రేక్షకులని కూడా అలరిస్తుంది. నడు నడువే పెరుతో ఇటీవలే కన్నడంలో రిలీజై అందరి ప్రశంసలు గెలుచుకుంటుంది. ఒక లఘు చిత్రం ఇలా రెండు భాషల్లోకి అనువాదం అయ్యిందంటే, అందులో ఎంత విశేషముందో అర్థమైపోతుంది. అశ్విన్ విరాజ్ హీరోగా కనిపించిన ఈ లఘు చిత్రాన్ని దీపక్ రెడ్డి డైరెక్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news