నేటి నుంచి భాగ్యనగరంలో భానుడి భగభగ.. 40 డిగ్రీలు దాట‌నున్న ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌..!

-

ఏప్రిల్ మాసం వచ్చేసింది. ఇక నేటి నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. ముఖ్యంగా భాగ్యనగరంలో భానుడి భగభగలు విపరీతంగా ఉండనున్నాయి. నగరంలో ఈ ఏడాది ఎండలు దంచికొట్టనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పగటి పూట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాట‌నుందని తెలిపింది. ఇప్ప‌టికే న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో 40 డిగ్రీల‌కు చేరువ‌లో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్న‌ట్లు చెప్పింది.

ఏప్రిల్ రెండు లేదా మూడో వారంలో న‌గ‌రంలోని పలు ప్రాంతాల్లో ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు 40 డిగ్రీలు దాటే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రించారు. 42 డిగ్రీల వ‌ర‌కు ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉందని తెలిపారు. గ‌త వారం రోజుల్లో న‌మోదైన ఉష్ణోగ్ర‌త‌ల‌ను ప‌రిశీలిస్తే.. 39 నుంచి 40 డిగ్రీల సెల్సియ‌స్ మ‌ధ్య న‌మోద‌య్యాయని.. మార్చి 31వ తేదీన తిరుమ‌ల‌గిరిలో అత్య‌ధికంగా 39.6 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

అయితే ఏప్రిల్ నెలంతా హైద‌రాబాద్ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ప్రజలు మధ్యాహ్నం పూట బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని చెప్పారు. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వ‌స్తే లేత రంగులో ఉన్న తేలిక‌పాటి దుస్తులు ధ‌రించాల‌ని.. శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గురి కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news