Breaking : ఏపీలో మళ్లీ తెరుచుకుంటున్న ఆలయాలు

-

ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణం వీడింది. సూర్యుడికి చంద్రుడు అడ్డు రావ‌డంతో గ‌గ‌న త‌లంలో వ‌ల‌యాకార సుంద‌ర దృశ్యం మంగళవారం కనువిందు చేసింది. ప్రపంచ దేశాల్లో ఇవాళ సాయంత్రం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడింది. పాక్షిక సూర్య గ్రహణం కారణంగా ఏపీలోని ప్రముఖ ఆలయాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం గ్రహణ ఘడియలు ముగిసిన నేపథ్యంలో, ఆలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో సంప్రోక్షణ, ప్రదోష కాల పూజల అనంతరం శ్రీవారి ఆలయాన్ని తిరిగి తెరిచారు.

Record 21,000 devotees have darshan in Tirumala on Saturday

ఈ రాత్రి 8.30 గంటల నుంచి సర్వదర్శనం భక్తులను అనుమతించనున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం, పద్మావతి అమ్మవారి ఆలయ ద్వారాలను కూడా తెరిచారు. వేదపండితులు ఆలయ శుద్ధి నిర్వహించారు. రాత్రి 8 గంటల నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. ఇక, సూర్య గ్రహణం అనంతరం శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయ ద్వారాలను తిరిగి తెరిచారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజల అనంతరం రాత్రి 8 గంటల నుంచి భక్తుల దర్శనాలకు అనుమతించారు.

Read more RELATED
Recommended to you

Latest news