మిల్క్‌ బ్యూటీ.. పరువాల పాలకోవ అందాల ఆరబోత

-

అందం, అభినయంతో ప్రేక్షకులను దశాబ్దానికిపైగా ఆకట్టుకొంటున్న హీరోయిన్ తమన్నా భాటియా. టీనేజ్ వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మిల్కి బ్యూటీ వరుస విజయాలను అందుకొంటూ దక్షిణాదిలోనే కాకుండా హిందీలో తనకంటూ ఇమేజ్‌ను, స్టార్‌డమ్‌ను సంపాదించుకొన్నది.

అనతికాలంలోనే అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇటీవల సైరాతోపాటు పలు వెబ్ సిరీస్‌లో నటిస్తూ
తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొంటున్నది.

తాజాగా F3 చిత్రంతో మరోసారి తన ప్రతిభతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. 53లో తమన్నా రోల్, గ్లామర్, తన కెరీర్ వివరాల్లోకి వెళితే.. F3 మూవీలో తమన్నా భాటియా రోల్ బిగ్ సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. ఈ సినిమాకు ఆమె పాత్ర ఓ టర్నింగ్ పాయింట్. హన్సిక పాత్రలోతమన్నా కనిపిస్తారు. ఈ పాత్రను దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతంగా మలిచారు. F2 చిత్రానికి మించి ఈ పాత్ర ఉంటుంది.

F2 మాదిరిగానే F3 చిత్రంలో తమన్నా పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. వెంకటేష్‌తో కలిసి ఆమె అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సోనాల్ చౌహాన్‌తో కలిసిన తర్వాత కథా స్వరూపమే మారిపోతుంది.

దాదాపు 17 యేళ్లుగా సినీ ఇండస్ట్రీని హీరోయిన్‌గా ఏలడం అంటే మాములు విషయం కాదు. తమన్నా తన మిల్కీ అందాలతో తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్‌లో సత్తా చూపెడుతోంది. ఇప్పటికే వన్నె తగ్గని అందంతో మత్తెక్కిస్తోంది.

తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 18 ఏళ్లైపోయింది. త్వరలో 20 యేళ్ల కెరీర్ పూర్తి చేసుకోబోతుంది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా. ఇన్నేళ్ల‌లో త‌మ‌న్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే.

ఈ భామ ఆస్తులు అంతస్తుల గురించి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్నాకు ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన జుహూలో రూ.16.60 కోట్ల ఖరీదైన అపార్ట్మెంట్ ఉందట. దీని విస్తీర్ణం 80,778 చదరపు అడుగులు ఉంటుందట. ఇక తమన్నా ఆస్తి మొత్తం రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news