సినిమా రంగంలో అవకాశం కోసం వెళ్లే వారికి అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. అలాగే అవకాశం కోసం వచ్చే వారిని మోసం చేసే బ్యాచ్ కూడా కాచుకొని వుంటారు. ఇలా మోసపోయే వారిలో ఎక్కువ మంది అమ్మాయిలే వుంటారు. వారి ఆశను అడ్డు పెట్టుకుని మగ మృగాలు వారిని లైంగికంగా వేదిస్తూ వుంటారు.
రీసెంట్ గా టీవీ ఛానెల్ లో ప్రకటన చూసిన ఒక అమ్మాయి సినిమా అవకాశం కోసం ప్రకటన లో ఇచ్చిన నంబర్ కు కాల్ చేసిందట. దానితో వారు తెలుగు లో అన్ని భాషల్లో సినిమాలు చేసిన ప్రొడక్షన్ పేరు చెప్పి ఒక హోటల్ అడ్రస్ ఇచ్చారట. దానితో సదరు అమాయకురాలు వారు చెప్పిన చోటుకు వెళ్లిందట.వారు హోటల్ రూమ్ బుక్ చేసి మంచి కాస్ట్లీ భోజనం పెట్టించారట. రేపు మేకప్ టెస్ట్ వుందని రెడీగా వుండమని, అడ్రస్ ఇచ్చి అక్కడకు రమ్మని చెప్పి వెళ్ళిపోయారట.ఉదయాన్నే వారు చెప్పిన చోటుకు వెళ్లిన ఆమెకు ఒక ఫోటో గ్రాఫర్ తో ఫోటోస్ తీపించారట.
దానితో ఆమె నేను హీరోయిన్ అయిపోయినట్లే అని సంబరపడి పోయిందట.ఆమెకు మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి నైట్ హోటల్ లో స్టొరీ డిస్కస్ చేయాల్సి వుందని చెప్పి పంపారట. చివరకు నైట్ అతని తో పాటు మరో ముగ్గురు వచ్చి కొద్ది సేపు మాట్లాడి డైరెక్టర్ వస్తాడని చెప్పి వెళ్ళి పోయారట. ఒక అరగంట తర్వాత ఒక పెద్దమనిషి వచ్చి ఆమెపై లైంగిదాడి కి పాల్పడ్డాడట.తీరా ఆమె తాను కాల్ చేసిన నంబర్ కు డయల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని సమాధానం వచ్చిందట. తీరా ఉదయాన్నే వచ్చిన అతన్ని నిలదీస్తే అతను నగరంలో పెద్ద బిగ్ షాట్ అని , కంప్లైంట్ ఇచ్చినా న్యాయం జరగదని, నీ పరువే పోతుందని మభ్యపెట్టి చేతిలో బస్ ఛార్జీలు పెట్టి మళ్లీ ఊరికి పంపించేశారట.వాస్తవానికి ఆ బిగ్ షాట్ కు అమ్మాయిని ఎరగా వేసి యాబై వేల రూపాయలు తీసుకున్నారట అదీ సంగతి.