వారికి మోడీ సర్కార్ గుడ్ న్యూస్.. 10 లక్షల రుణం…!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. అలానే కేంద్రం రోజు రోజుకీ కొత్త స్కీమ్స్ ని కూడా తీసుకు వస్తూనే వుంది. ప్రభుత్వ పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారు. అయితే కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి ముద్ర లోన్ యోజన ఒకటి. దేశ వ్యాప్తంగా ఉన్న చిన్న వ్యాపారులందరూ కూడా ఈ స్కీమ్ కింద ప్రయోజనాన్ని పొందొచ్చు.

ఈ స్కీమ్ కింద 10 లక్షల వరకు లోన్ ని తీసుకోవచ్చు. దీన్ని మీరు 3 లేదా 5 సంవత్సరాలలో కట్టాల్సి ఉంటుంది. ప్రజలకు రుణ సహాయం ని ఇచ్చేనందుకు.. వాళ్ళ అవసరాలని తీర్చేందుకు ఈ స్కీమ్ ని తీసుకు రావడం జరిగింది. ముద్ర రుణ పథకం కింద మీరు రూ.10 లక్షల వరకు లోన్ ని పొందొచ్చు. వ్యాపారవేత్తలకు వాణిజ్య బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు ఈ లోన్ ని ఇవ్వనున్నారు.

ఎలా దరఖాస్తు చెయ్యాలి..?

దీని కోసం మీ దగ్గర లోని బ్యాంక్ కి వెళ్లి దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చెయ్యాలి.
అలానే అవసరమైన అన్ని పత్రాలను కూడా ఇవ్వాలి.
కావాలంటే ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

ముందు udyamimitra.inని సందర్శించండి. నెక్స్ట్ హోమ్‌పేజీలో ముద్ర లోన్ కోసం దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.
SMS ద్వారా మీ ఫోన్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ వస్తాయి.
డాక్యుమెంట్స్ ని ఇవ్వాలి. అలానే దరఖాస్తు ఫారమ్ నింపండి.
క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేసేసి… దరఖాస్తు ఫారమ్ ఆమోదించబడుతుంది.
దీనిలో మీరు ముఖ్యమైన డాక్యుమెంట్స్ ని ఇవ్వడమే కాక మీ వ్యాపారం, చిరునామా, వ్యాపారానికి సంబంధించిన ఏదైనా రుజువును కూడా ఇవ్వాల్సి వుంది.

ముద్ర రుణం పై వడ్డీ రేట్లు ఎంత…?

ఇందులో స్థిర వడ్డీ రేటు లేదు.
కనీస వడ్డీ రేటు 12%.
గరిష్టంగా రూ. 10 లక్షల వరకు రుణం పొందవచ్చు.
కేవలం వ్యాపారులకే ఈ లోన్ అని గుర్తు పెట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news