ఉగాండాలో దారుణం.. స్కూల్‌పై దాడి చేసి 37 మంది విద్యార్థులను చంపిన టెర్రరిస్టులు

-

ఉగాండాలో దారుణం జరిగింది. ఓ పాఠశాలలో శుక్రవారం జరిగిన దాడిలో 25 నుండి 26 మంది మరణించగా, ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు 1.2 మైళ్ల దూరంలో ఉన్న ఎంపాండ్వే పట్టణంలోని లుబిరిరా సెకండరీ స్కూల్‌లో జరిగిన ఈ దారుణానికి… అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ దుండగులు వసతి గృహాన్ని తగులబెట్టి ఆహారాన్ని దోచుకున్నట్లు చెప్పారు. ఈ ఘాతుకానికి పాల్పడినవారు పరారీలో ఉన్నట్లు చెప్పారు. యుపిడిఎఫ్ (ఉగాండా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్), పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. తిరుగుబాటు గ్రూపు కారణమని పోలీసులు తెలిపారు.

ఉగాండాలో దారుణం.. జీతం ఇవ్వలేదని మంత్రినే కాల్చేశాడు..

విద్యార్థులను కత్తులతో నరికివేశారని అధికారులు తెలిపారు. మరణించిన 37 మంది విద్యార్థులు మృతదేహాలను బ్వేరాలోని ఆస్పత్రికి తరలించినట్లు ఉగాండా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపాయి. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారని.. ఆరుగురిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. కిడ్నాప్ చేసిన వారిని కాంగో సరిహద్దుల్లో ఉన్న విరుంగా నేషనల్ పార్క్ వైపు తీసుకెళ్తున్నారని, విద్యార్థులను రక్షించేందుకు భద్రతా సిబ్బంది వెంబడించడం ప్రారంభించిందని ఉగాండా ప్రభుత్వం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news