తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..2 వేల మందికి ఉపాధి

-

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు అపారెల్ పార్క్ లో… బెంగళూరుకు చెందిన ప్రముఖ ఉత్పత్తుల సంస్థ టెక్స్ పోర్ట్ గ్రూప్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో టెక్స్ పోర్టు సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది.

ప్రభుత్వ చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్, ఎక్స్ పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర గోయంకా ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు గ్రామ పరిధిలో రాష్ట్రప్రభుత్వం 63 ఎకరాల్లో 175 కోట్ల రూపాయలతో అప్పారెల్ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.

అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు కల్పిస్తున్నారు. అప్పారెల్ ఉత్పత్తులతో పాటు ఎగుమతులకు అనుగుణంగా… బెల్ట్ టు షూట్ పద్ధతిగా దేశంలోనే తొలిసారి ఈ పార్కును తొలిసారి చేస్తున్నారు. ఈ పార్కులో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో.. ఎక్స్ పోర్ట్ కంపెనీ ఏకంగా 60 కోట్ల పెట్టుబడితో తన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఏకంగా రెండు వేల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. ఇక ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news