భారీగా డిమాండ్ చేస్తున్న థమన్..ఎన్ని కోట్లంటే..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి చిన్న వయసులోనే సంగీతంపై మక్కువ పెంచుకున్న ఈయన శిక్షణ తీసుకొని ఇండస్ట్రీలోకి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇక ఇలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి విడుదలైన ప్రతి ఒక్క భారీ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఇలా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, అఖండ, గాడ్ ఫాదర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో పాటు పారితోషకం విషయంలో కూడా బాగా డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. మొన్నటి వరకు ఒక్కొక్క సినిమాకు కేవలం మూడు కోట్ల వరకు పారితోషకం తీసుకునే థమన్.. ఇప్పుడు తమ తదుపరి సినిమాలకు భారీగా పారితోషకం పెంచారు అని సమాచారం. ప్రస్తుతం ఈయన ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇలా వరుస హిట్టు సినిమాలతో ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా భారీగా రెమ్యునరేషన్ కూడా పొందుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన మ్యూజిక్ అందించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే.. ఆయన పారితోషకం పెంచడానికి కారణమని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం గాడ్ ఫాదర్ వంటి సూపర్ హిట్ సినిమానందుకోవడంతో.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక మరొకవైపు తమిళ్ ప్రాజెక్టు లతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ ,మహేష్ బాబు దర్శకత్వంలో వస్తున్న సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. అలాగే బోయపాటి, రామ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి కూడా ఈయనే సంగీతం వహిస్తూ ఉండడం గమనార్హం. అందుకే ఈ రేంజ్ లో పారితోషకం డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news