ఆ హీరో అంటే పిచ్చి.. అతని సినిమాలో పనిమనిషి పాత్రకైనా సిద్ధమే.. జబర్దస్త్ ఐశ్వర్య

-

సీరియల్ ఆర్టిస్ట్ జబర్దస్త్ ఫేమ్ ఐశ్వర్య తాజాగా ఒక స్టార్ హీరోని ఆకాశానికి ఎత్తేసింది.. ఆ హీరో అంటే పిచ్చని ఆయన సినిమాలో ఎలాంటి పాత్ర వచ్చిన చేయడానికి సిద్ధమేనంటూ చెప్పుకొచ్చింది..జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో మంచి పేరు సంపాదించుకున్న నటి ఐశ్వర్య. పలు సీరియల్స్ లో సైతం నటిస్తూ వరుస అవకాశాలు అందుపుచ్చుకుంటుంది.. ఈమె తాజాగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అతని సినిమాలో పనిమనిషి పాత్ర చేయడానికి అవకాశం వచ్చిన సిద్ధమే అంటూ తెలిపింది..

Ishwarya vullingala🇮🇳 (@actressishwarya) / Twitter

 

ఈ సందర్భంగా మాట్లాడిన ఐశ్వర్య.. “టాలీవుడ్‌ స్టార్స్‌లో నేను అభిమానించే వ్యక్తి పవన్‌కల్యాణ్‌. ఆయన్ను కలిసే అవకాశాలు చాలా వచ్చినా ఎప్పుడూ కలవలేకపోయా. నటిగా గుర్తింపు తెచ్చుకుని నువ్వు ఫలానా కదా అని గుర్తించాక ఆయన్ను కలవాలని నా కోరిక.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోజు నుంచీ పవన్‌కల్యాణ్‌ సినిమాలో కనిపించాలని నా ఆశ. కానీ ఒక కండీషన్‌. పవన్‌కల్యాణ్‌గారి సినిమాలో పని మనిషిగా చిన్న పాత్ర అయినా చేస్తాను కానీ ఆయనకు అక్కా చెల్లిగా మాత్రం నటించను. ఆయన పేరు వింటేనే నాకు రోమాలు నిక్కబోడుచుకుంటాయి. పవన్‌ కల్యాణ్‌గారి కోసం ఏం చేయడానికైనా రెడీ. ఆయనంటే అంత క్రష్‌ నాకు. ఆయన చేసే పాత్రలు, సేవా కార్యక్రమాలు చూసి చాలా ఇన్‌స్పైర్‌ అవుతుంటా. రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ఆయన నాకెంతో స్ఫూర్తి..” అంటూ చెప్పుకొచ్చారు..

Ishwarya vullingala🇮🇳 (@actressishwarya) / Twitter

అలాగే మోడల్గా తాను కెరీర్ను మొదలు పెట్టానని ఆ తర్వాత ఈవెంట్స్ లో కనిపిస్తూ టీవీ సీరియల్ లో అవకాశాన్ని అందుకున్నానని చెప్పకు వచ్చారు ఐశ్వర్య అలాగే.. “తొలుత టీవీ నటిగానే అందరికీ తెలుసు. ‘జబర్దస్ట్‌’లో అడుగుపెట్టాక పాపులర్‌ అయ్యాను. శ్రీదేవి డ్రామా కంపెనీతో నాకు మంచి పేరు వచ్చింది. లవ్‌ మీద రెస్పెక్ట్‌ ఉంది. ప్రస్తుతానికి అమ్మతో ప్రేమలో ఉన్నా. అమ్మ ప్రేమను మించిన ప్రేమ దొరికితే అప్పుడు ప్రేమ, పెళ్లి లాంటి విషయాల గురించి ఆలోచిస్తా. ‘హైపర్‌’ ఆది అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. మా ఇద్దరిపై రూమర్స్‌ కూడా వచ్చాయి. చాలామంది ‘ఆదిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్‌’ అని అడుగుతారు. ప్రస్తుతానికి నేను సింగిల్‌గా ఉన్నా. రూమర్స్ ను పట్టించుకోవాలని అనుకోవడం లేదు ప్రస్తుతానికి నటన పైనే దృష్టి పెట్టాను.. “అంటూ తెలిపారు..

Read more RELATED
Recommended to you

Latest news