ఆ మంత్రి చేసిన ప‌నికి వైసీపీలో చిచ్చు… జ‌గ‌న్‌కు పెద్ద త‌ల‌నొప్పే…!

-

ఎన్న‌డూ లేని విధంగా 132 కులాల‌కు 56 కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేసింది వైసీపీ. వీరంతా కూడా బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే కావ‌డం.. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రంలోనూ ఇలా ఇంత సంఖ్య‌లో కార్పొరేష‌న్లు ఏర్పాటు చేయ‌క‌పోవ‌డం.. వంటివి రికార్డుగానే గుర్తించారు. మ‌రీ ముఖ్యంగా బీసీలే త‌మ ఓటు బ్యాంకు.. వెన్నెముక అంటూ.. సాగ‌దీసే.. చంద్ర‌బాబు ఆయ‌న పార్టీ టీడీపీకి ఒక‌ర‌కంగా కోలుకోలేని దెబ్బ‌గామారుతుంద‌ని అనుకున్నారు వైసీపీ నాయ‌కులు. అయితే, అనూహ్యంగా స‌ర్కారు ఈ విష‌యంలో వేసిన త‌ప్ప‌ట‌డుగులు కొత్త వివాదాల‌కు దారితీశాయి.

దీంతో వైసీపీపై ఇప్పుడు బీసీ వ‌ర్గాల నుంచే తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏం జ‌రిగిందంటే.. బీసీ కార్పొరేష‌న్ల‌కు సంబంధించిన  డైరెక్ట‌ర్ల పోస్టుల విష‌యంలో చాలా వ‌ర‌కు సిఫార‌సులు చోటు చేసుకున్నాయ‌ని బీసీ సంక్షే మ సంఘాలు ఆరోపిస్తున్నాయి. చైర్మన్ల విష‌యంలో నేరుగా ఎమ్మెల్యేలు ఎవ‌రినైతే.. సిఫార‌సు చేశారో.. వారికే జ‌గ‌న్ ఛాన్స్ ఇచ్చార‌ని వైసీపీ నేత‌లే చెప్పుకొచ్చారు. ఇందులో ఎక్క‌డా ఎవ‌రూ విభేదించ‌డం లేదు.

అయితే, ఎటొచ్చీ.. డైరెక్ట‌ర్ల విష‌యంలో మాత్రం.. నియామకాలు తీవ్ర త‌ప్పులు త‌డక‌ల‌తో ఉన్నాయ‌ని.. కొంద‌రు మంత్రుల జోక్యంతో ఈ ప‌ద‌వులు సామాజిక వ‌ర్గాలు కాని వారికి కూడా ద‌క్కాయ‌ని అంటున్నారు.ముఖ్యంగా అగ్నికుల క్ష‌త్రియులు త‌మ వారిని ప్రోత్స‌హించే విధానంలో భాగంగా బెస్త‌, మ‌త్య్స కార కార్పొరేష‌న్ల‌లోనూ నెల్లూరుకు చెందిన వారిని నియ‌మించ‌డం తీవ్ర వివాదానికి దారి తీసింది. అయితే, దీనివెనుక ఓ మంత్రి ఉన్నార‌ని తెలుస్తొంది.

బ‌ల‌మైన వాయిస్ ఉన్న మంత్రి.. త‌న వారిని ప్రోత్స‌హించుకునేందుకు ఈ డైరెక్ట‌ర్ల ప‌ద‌వులు వినియోగించుకున్నార‌ని వైసీపీ నేత‌లే అంటున్నారు. ఇక‌, బీసీ నాయ‌కులు కూడా ఈ విష‌యాన్ని ర‌చ్చ చేస్తున్నారు. త‌మ వారికి ప‌ద‌వులు ఇచ్చుకునేందుకు మా కులాలే కావాల్సి వ‌చ్చాయా? అని బెస్త , మ‌త్స్య‌కార సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు.. ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు జ‌గ‌న్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారే ప‌రిస్తితి వ‌చ్చింద‌ని అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ దీనిని ఎలా ప‌రిష్క‌రిస్తారో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news