తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది.. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో.. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశపడి భంగపడ్డ నేతలు అసమ్మతి సెగలు రగుల్చుతున్నారు. అయితే.. ఇటీవల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ నుంచి బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల వార్ నడుస్తోంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ నడిచింది. టికెట్ తనకంటే తనకే వస్తుందంటూ పోటాపోటీగా ఇద్దరూ నేతలు ప్రకటనలు చేశారు. ఒకరిపై ఒకరిపై తీవ్ర స్థాయిలో ఘాటు విమర్శలు చేశారు. ఈ విమర్శలు చివరికి పరిధులు దాటి వ్యక్తిగత విషయాలపై కామెంట్స్ చేసుకునే వరకు కూడా వెళ్లాయి. మీడియా వేదికగానే ఇద్దరూ బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు.
ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు కన్‌ప్యూజన్ నెలకొంది. కానీ చివరికి ఇటీవల ప్రకటించిన జాబితాలో కడియం శ్రీహరికే టికెట్‌ను బీఆర్ఎస్ కన్ఫామ్ చేసింది. టికెట్ దక్కలేదనే అసంతృప్తితో శ్రీహరిపై మాటల దాడికి రాజయ్య మరింత పెంచారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి కడియంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఇక్కడే ప్రజల్లో ఉండి అభివృద్ది పనులు చేపడుతుంటే.. కొంతమంది అన్నీ తానే చేసినట్లు బిల్డప్ ఇచ్చుకుంటున్నారంటూ కడియంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.