లింగు స్వామి దర్శకత్వంలో కృతి శెట్టి హీరోయిన్ గా, రామ్ పోతినేని హీరోగా రూపొందిన “ది వారియర్” చిత్రం రేపు థియేటర్ల ముందుకు రానుంది. అయితే సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ..” మొదటి నుంచి కూడా నాకు బోయపాటి సినిమాలు అంటే ఇష్టం. ఆయన సినిమాలు నేను తప్పకుండా చూస్తూ ఉంటాను. తన కథల్లో మాస్ అంశాలు చేరుతూనే ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్కి రప్పించడం ఎలాగన్నది ఆయనకు బాగా తెలుసు.
నాకు ఆయన వినిపించిన కథ కూడా అదే తరహాలో ఉంది. ఆయన ట్రీట్మెంట్ పై నాకు బలమైన నమ్మకం ఉంది. అందువల్లే నా పాన్ ఇండియా సినిమా ఆయనతో ఉండాలని ఆశించాను. అందుకు అన్ని కుదిరినందుకు చాలా హ్యాపీగా ఉంది. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది” అని చెప్పారు. నిజానికి బోయపాటి మిగతా హీరోలతో తెరకెక్కించిన సినిమాలు వేరు, బాలయ్యతో చేసే మూవీస్ వేరు.
వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చిన ప్రతిసారి ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి బాలయ్య సెంటిమెంట్ ను రామ్ మూవీ కోసం అప్లై చేస్తున్నాడట. బోయపాటి కొత్త చిత్రం లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ని డ్యూయల్ రోల్ లో నటింపజేస్తున్నట్లు సమాచారం.