అలా జరగడం వల్లే నా బాయ్ ఫ్రెండ్ వదిలేశాడు .. కీర్తీ భట్..!

-

బిగ్ బాస్ సీజన్-6 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న కీర్తి భట్ ప్రేక్షకులను బాగానే అలరించింది. అయితే ఈమె బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాతే బాగా పాపులర్ అయ్యింది. అయితే ఈమె జీవితంలో ఎన్నో విషాదాలు దాగున్నట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసేది. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఎంతో డల్ గా కనిపించిన ఈ అమ్మాయిని చూసిన ప్రతి ఒక్కరు కూడా విసుక్కున్నారు. కీర్తి భట్ అలా ఎందుకు ఉంది. ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం.

ఈ సీజన్లో సెకండ్ రన్నర్ అప్ గా నిలిచింది కీర్తి భట్. డబ్బులు ఎరవేసినా తనని అభిమానులు ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారో ఆ స్థానానికి కట్టుబడి ఉంటాను అంటూ చివరిగా మూడవ స్థానంలో నిలిచింది. ఇండస్ట్రీలో నటించాలని కోరికతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది కన్నడ ముద్దుగుమ్మ కీర్తి. మొదట మనసిచ్చి చూడు అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి.. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయింది. అయితే కొన్ని కారణాల చేత తన కుటుంబం మొత్తం మరణించగా ప్రస్తుతం ఆమె అనాధగా ఉన్నట్లు తెలుస్తోంది. అలా అనాధగా ఉన్నదని ఆమెను ప్రేమించిన వ్యక్తి ఈమెను వదిలేసి వెళ్లిపోయాడని తెలియజేస్తోంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ.. తను ఒకరిని ప్రేమించానని.. కొద్ది రోజులు ఇద్దరం బాగానే ఉన్నాం.. కానీ కొన్ని పరిస్థితులు అతనికి నాకు బ్రేకప్ చెప్పేలా చేశాయి.. ఎందుకంటే నాకు బ్యాగ్రౌండ్ లేదు నేను ఏం చేసి ఇండస్ట్రీకి వచ్చాను అన్న అనుమానంతో వదిలేశారు.. ఇక్కడిదాక వచ్చానంటే ఏం చేసి వచ్చిందో అని దగ్గర వాళ్లకు చాలా చులకనగా చూస్తూ ఉంటే చాలా కష్టంగా అనిపించేదని. అలాంటిది అతడు కూడా అర్థం చేసుకుంటారా ? అంటూ తెలియజేస్తుంది. దీంతో ఆ విషయాలు గుర్తుకు వస్తే ఏడ్చుకుంటూ ఉండిపోతాను కానీ ప్రస్తుతం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను త్వరలోనే మళ్లీ ఒక పాపను దత్తకు తీసుకుంటాను అంటూ తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news