హీరో నాగార్జునకు గోవా సర్పంచ్ నోటీసులు

-

టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జునకు ఊహించని షాక్ తగిలింది. గోవాలోని మాండ్రం పంచాయతీ నుంచి సినీ హీరో నాగార్జునకు నోటీసులు జారీ అయ్యాయి. అక్రమ నిర్మాణం విషయంలో ఈ నోటీసులు వచ్చాయి.

అశ్వివాడ గ్రామ పరిధిలో సర్వే నెంబరు 211/2B lo అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారన్న కారణంతో, గోవా పంచాయతీరాజ్ చట్టం 1994 కింద ఆ గ్రామ సర్పంచి హీరో అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ చేశారు. చేపట్టిన పనులు నిలిపివేయకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఈ నోటీసులు జారీ చేశారు ఆ గ్రామ సర్పంచ్. అయితే దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా ఇటీవల నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news