అక్రమ టెలిఫోన్ ఎక్చేంజిని గుర్తించిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు!

-

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ ఇంటిపై అహ్మదాబాద్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు దాడి చేసి అక్రమ టెలిఫోన్ ఎక్చేంజిని గుర్తించారు.కిందట నెలలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ అహ్మదాబాద్ లో భారత్-ఆసీస్ టెస్టు మ్యాచ్ కు విచ్చేశారు. అయితే వారి రాకకు ముందు, ప్రజలను బెదిరింపులకు గురిచేస్తూ ఖలిస్తాన్ ఉగ్రవాది గుర్ పవంత్ సింగ్ పన్నూ పేరిట ఓ ఆడియో సందేశం వైరల్ అయింది. ఈ ప్రీ రికార్డెడ్ ఆడియో సందేశం ఘజియాబాద్ లోని ఇంట్లో ఉన్న అక్రమ టెలిఫోన్ ఎక్చేంజి నుంచి వెలువడినట్టు గుర్తించారు. ఈ దాడుల్లో ఏటీఎస్ పోలీసులు పెద్ద సంఖ్యలో మొబైల్ సిమ్ కార్డులు, ఒక శాటిలైట్ ఫోన్, 6 మొబైల్ ఫోన్లు, పలు టెలిఫోన్ ఎక్చేంజి యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Police busted illegal telephone exchange in Ghaziabad and detain brother and sister

కాగా, విదేశాల నుంచి వచ్చే ప్రీ రికార్డెడ్ సందేశాలను జునైద్, రిహానా ఈ అక్రమ టెలిఫోన్ ఎక్చేంజి ద్వారా లోకల్ గా మార్చి, వాటిని వివిధ ఫోన్ నెంబర్లకు పంపించేవారు. కాగా, ఈ టెలిఫోన్ ఎక్చేంజిని బిసోఖర్ లోని అష్ఫాక్ అనే వ్యక్తి ఇంటి పై అంతస్తులో నిర్వహించేవారు. వీరి వద్ద ఉన్న పరికరాల నుంచి కాల్ చేస్తే ఎక్కడ్నించి వచ్చాయో తెలుసుకోవడం కష్టమని భావిస్తున్నారు. వీరు రోజుకు 26 వేల కాల్స్ చేసేవారని వెల్లడైంది. జునైద్ అనే వ్యక్తిని, అతని సోదరి రిహానాను అరెస్ట్ చేశారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news