పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనం తీసుకునే రోజువారి ఆహారంలో పండ్లని భాగం చేసుకొమ్మని పోషకాహార నిపుణూలు సలహా ఇస్తుంటారు. ఇక పిల్లలకయితే మరీ ప్రత్యేకంగా చెబుతుంటారు. ఐతే ఎవరెన్ని చెప్పినా పండ్లని ఆహారంగా తీసుకోవడం చాలా తక్కువ. అదీగాక ఖరీదు ఎక్కువ అని చెప్పి కూడా వాటిని ఆహారంగా తీసుకోవడానికి మధ్యతరగతి వారు దూరంగా ఉంటారు. ఐతే ఏయే పండ్లలో ఎన్ని పోషకాలున్నాయో, వాటివల్ల లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జామ
జామలో కొవ్వు శాతం తక్కువగా ఉండి, విటమిన్ సి అధికశాతంలో ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే సోడియం, ఫైబర్ ఉంటుంది. వీటివల్ల రక్తపీడనం (బీపీ) నియంత్రణలో ఉంటుంది. రక్తంలోని విషపదార్థాలని బయటకు తీసేసి మంచి పదార్థాలని అందిస్తుంది.
కొబ్బరి
ఇది ఆంటిబాక్టీరియాగా పనిచేస్తుంది. దీని నుండి తీసిన నూనె ద్వారా చర్మ సమస్యలు, జుట్టు సమస్యలకి చెక్ పెట్టవచ్చు. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
దోసకాయ
ఇందులో ఉండే ఫైబర్ కారణంగా మలబద్దకం సమస్య నుండి బయటపడవచ్చు. ఆర్థరైటిస్, డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన ఫలితాలని అందిస్తుంది. దోసకాయని చర్మానికి అప్లై చేసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి.
అరటి పండు
ఒత్తిడిని నియంత్రించడంలో అరటి పండు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం కారణంగా, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. డయారేయా తో బాధపడే చిన్నపిల్లలు, టీనేజీ వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి అరటి పండు మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
ఆపిల్
ఆపిల్ లో ఉండే పెక్టిన్ వల్ల, శరీరంలో విషపదార్థాలు బయటకి వెళ్ళిపోతాయి. దీన్ని సరిగ్గా కొరికితే అందులో ఉండే ఆమ్లాల వల్ల నోట్లో ఉండే సూక్ష్మ జీవులు చచ్చిపోతాయి.