డయాబెటిస్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ దీర్ఘ కాలిక సమస్యతో బాధపడుతున్నారు. దీనివలన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను రెగ్యులేట్ చేయడానికి తగినంత ఇన్సులిన్ ను ప్రొడ్యూస్ చేయలేదు. వైద్యులు అలాగే నిపుణులు అభిప్రాయం ప్రకారం ఈ కండిషన్ ను మేనేజ్ చేయడానికి వివిధ రకాల డైట్ ను అలాగే లైఫ్ స్టైల్ మార్పులను కూడా సజెస్ట్ చేస్తారు. తీపి పదార్థాలను అలాగే డ్రింక్స్ ను అవాయిడ్ చేయడం వాటిలో ముఖ్యమైనది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను మేనేజ్ చేయడానికి తోడ్పడే రెమెడీస్ కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో మెంతి నీళ్ళు కూడా ఒకటి. ఈ మెంతి నీళ్ళు రక్తంలో చక్కెర స్థాయి ని నియంత్రిస్తాయి.
రక్తం లో చక్కెర స్థాయిలు క్రమబద్దీకరించడం లో మెంతినీళ్లు అత్యద్భుతంగా తోడ్పడతాయి. ఈ విషయాన్ని వెయిట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అలాగే న్యూట్రిషనిస్ట్ కూడా చెబుతున్నారు.మెంతి అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే డయాబెటిస్ బారిన పడినవారికి మెంతి నీళ్లు బాగా ఉపయోగకరం. అంతేకాక, మెంతినీళ్లలో సాల్యుబుల్ ఫైబర్ లభిస్తుంది. ఇది షుగర్ గ్రహింపును తగ్గిస్తుంది మెంతినీటిని తయారుచేసే విధానం ఎంతో సులభం. ఒక టీస్పూన్ మెంతిగింజలను నీళ్ళల్లో రాత్రంతా నానబెట్టాలి. ఆ మరుసటి రోజు గింజలను తీసివేసి ఆ నీటిని తాగేయాలి. పరగడుపునే ఈ నీటిని తాగాలి.
ఉదయాన్నే ఈ రెమెడీను పాటిస్తే అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. వీటన్నిటిలో చాలా క్లినికల్ ట్రయల్స్ అనేవి టైప్ 1 అలాగే టైప్ 2 డయాబెటిస్ కి సంబంధించిన జీవక్రియలను మెరుగుపరుస్తుంది.రక్తంలో చక్కెర స్థాయి తగ్గిస్తుందనే విషయం స్పష్టమైంది. ఇక టైప్ 1 డయాబెటిస్ లో ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గాయని కనుగొన్నారు. అలాగే గ్లూకోజ్ టాలరెన్స్ పెరగడం, మొత్తం కొలెస్ట్రాల్ తగ్గడం వంటివి జరుగుతున్నట్టు గమనించారు.
ఇంకొక కంట్రోల్డ్ ట్రయల్ లో టైప్ 2 డయాబెటిస్ కలిగిన వారి భోజనం లో 15 గ్రాముల మెంతిగింజల పొడిని కలిపి తీసుకోవడం ద్వారా పోస్ట్ మీల్ బ్లడ్ గ్లూకోజ్ పెరుగుదల తగ్గడాన్ని గుర్తించారు. అలాగే మరొక అధ్యయనం లో రోజుకు రెండుసార్లు 2.5 గ్రాముల మెంతులను మూడునెలల పాటు తీసుకోవడం వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి టైప్ 1,కానీ టైప్ 2 డయాబెటిస్ లో తగ్గినట్టు గుర్తించారు.