వచ్చె నెల 1 వ తేదీన పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ వరుసగా నాలుగో సారి బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు. కాగ కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి కూడా బడ్జెట్ ను డిజిటల్ రూపంలోనే పార్లమెంటు ముందుకు తీసుకుని రావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి లేని సమయంలో బడ్జెట్ పత్రులను అవసరానికి మించి ముద్రించేవారు.
ప్రతి ఎంపీతో పాటు జర్నలిస్టులతో పాటు తదితరులకు ఆ పత్రులను అందించేవారు. కానీ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న సమయం నుంచి పేపర్ పై కాకుండా డిజిటల్ గానే బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు. అయితే బడ్జెట్ ను చూడాలనుకుంటే.. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ అనే పేరుతో మొబైల్ యాప్ ను రూపిందించింది. ఈ యూనియన్ బడ్జెట్ యాప్ ద్వారా బడ్జెట్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.