అదృశ్యశక్తి తో దెబ్బకు దిగి వచ్చిన విమర్శకుడు..!!

-

తాజాగా ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ హెడ్ నవాద్ లాపిడ్ కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఉద్దేశించి  నెగిటివ్ కామెంట్స్ చేయడం తో దేశంలో మళ్లీ వివాదం చెలరేగిన సంగతి అందరికి తెలిసిందే.వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’  మంచి వసూళ్లు రాబట్టింది. గతంలో నూ ఈ సినిమా పై చాలా వివాదాలు కూడా వచ్చాయి. ఇది రాజకీయ నాయకులు మధ్య వార్ నడిచేలా చేసింది.

ఇక తాజా వివాదం పై మరియు లాపిడ్‌ చేసిన వ్యాఖ్యలపై ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రపంచ మేధావులకు, ఈ మహా గొప్ప ఇజ్రాయెల్‌ చిత్రనిర్మాతకు ఇదే నా సవాల్. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ఒక్క ఫ్రేమ్ కానీ, ఒక్క డైలాగ్ కానీ, ఒక్క ఘటన కానీ అసత్యం అని నిరూపించండి చాలు. నేను ఇక సినిమాలు తీయడం మానేస్తా’ అని వివేక్ అగ్నిహోత్రి ఛాలెంజ్ విసిరారు. దీనిపై దేశం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక రంగంలోకి దిగిన పెద్ద స్థాయిలో ఉన్న వారు రంగంలోకి దిగి వార్నింగ్ ఇచ్చే సరికి దెబ్బకి లాపిడ్ దిగి వచ్చాడు.ది కశ్మీర్‌ ఫైల్స్‌ పై తాను చేసిన వ్యాఖ్యలతో బాధపడిన వారికి క్షమాపణలు చెబుతున్నట్లు ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు. తాను ఎవరినీ అవమానించాలనుకోనని, అది తన ఉద్దేశం కాదని తెలిపారు. తన మాటలకు ఎవరైనా బాధపడితే అందుకు క్షమించాలని కోరారు. చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి కోపాన్ని తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. ఇక అదృశ్య శక్తి దెబ్బ మామూలుగా లేదుగా.

Read more RELATED
Recommended to you

Latest news