ఇంట్లో కోవిడ్ పేషెంట్స్ ఉన్నారా..? అయితే ఈ పనులు చెయ్యొద్దు…!

-

కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ కరోనా బారిన పడి పోతున్నారు. ఎంతైనా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇంట్లో ఎవరైనా కోవిడ్ బారిన పడితే తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోండి. లేదు అంటే అందరికీ వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఆరోగ్యంగా ఉండడం అన్నిటి కంటే ముఖ్యం. ఒకవేళ కనుక మీ ఇంట్లో కోవిడ్ పేషెంట్ ఉంటే తప్పకుండా వీటిని అనుసరించండి. లేదు అంటే అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది.

కోవిడ్ పేషెంట్ ఉన్న ఇంట్లో చేయాల్సిన పనులు:

ఒకవేళ మీ ఇంట్లో కనక పేషంట్ ఉంటే తప్పకుండా అందరూ మాస్కులు వేసుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు తీయొద్దు.

పేషెంట్ బట్టలని సపరేట్ గా ఉంటాకండి. ముందు ఏదైనా డిసిన్ఫెక్ట్డ్ లో సోక్ చేసి ఆ తర్వాత వాష్ చేయడం మంచిది.

ఇన్ఫెక్షన్ బాత్రూమ్ నుంచి కూడా వ్యాపించవచ్చు. కాబట్టి వాళ్ళకి సెపరేట్ బాత్ రూమ్ ఉంచండి ఇలా చేయడం వల్ల వ్యాధి వ్యాపించకుండా మీరు ఆపవచ్చు.

అదే విధంగా వాళ్ళకు సంబంధించిన చెత్తని సపరేట్ గా వేసి ఉంచడం మంచిది.

చేయకూడని పనులు:

వైరస్ బారిన పడిన పేషెంట్ రూమ్ లోకి వెళ్లడం అంత మంచిది కాదు. ఎందుకంటే గాలి ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. కాబట్టి వాళ్ళు ఉండే ప్రదేశానికి మీరు దూరంగా ఉండటం మంచిది.

అదే విధంగా శానిటైజర్ తో లేదా సబ్బుతో లేదా చేతుల్ని శుభ్రం చేసుకోవడం… ఏదైనా తినేటప్పుడు తాగేటప్పుడు కూడా ముందు చేతులు కడుక్కోవడం ఇలాంటివి చేయండి. అలానే పేషెంట్ తిన్న సామాన్లని వేరేగా వాష్ చెయ్యడం.. అలానే వేరొకరి ఇంటికి వెళ్లడం కూడా మానేయండి. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news