ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్ కు షాక్ ఇచ్చిన డెలివరీ బాయ్.. చివరకు..

-

ఈ మధ్య కాలంలో ఇంట్లో ఫుడ్ వండటం చాలా మంది మానేశారు..అందరు కూడా ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసుకుంటున్నారు.. మనకు నచ్చిన ఫుడ్ క్షణాల్లో మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తున్నారు. అందరు ఇలానే చేస్తున్నారు..దాంతో ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీ చేస్తున్న సంస్థలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అంతేకాదు కస్టమర్లకు షాక్ లు ఇస్తున్నారు. ఫుడ్ లో ఏదొకటి రావడం లేదా టేస్ట్ లెస్ ఫుడ్ ను అందిస్తున్నారు.తాజాగా ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.

ఓ వ్యక్తికి బాగా ఆకలేసింది. అనుకున్నదే తడవుగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. ఆ ఫుడ్ ఆర్డర్‌ను డెలివరీ బాయ్ ఎప్పుడెప్పుడు ఇంటికి తీసుకొస్తాడా అని ఎదురు చూశాడు..కానీ అతను రాకపోగా,అతని నుంచి ఒక మెసేజ్ వచ్చింది.అదేంటని చూడగా.. దెబ్బకు అతడి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ ఘటన యూకే చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. యూకేకు చెందిన లియామ్ అనే వ్యక్తి డెలివిరో అనే ఆన్‌లైన్ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. దాని కోసం ఎదురు చూస్తుండగా.. కొంత సమయం తర్వాత అతడి సెల్‌కి మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి.

అది కూడా డెలివరీ బాయ్ నుంచి వస్తున్నాయి. ఏంటా అని చూడగా.. దెబ్బకు కంగుతిన్నాడు.మొదటిగా ‘సారీ’ అని మెసేజ్ చేసిన ఆ డెలివరీ బాయ్.. ఆ తర్వాత ‘మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ చాలా రుచిగా ఉంది. నేను ఆ ఫుడ్ తినేశాను. కావాలంటే మీరు డెలివిరో కంపెనీకి ఫిర్యాదు చేసుకోండని’ మెసేజ్‌ల్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ ఘటనలు ఈ మధ్య ఇలాంటి ఎక్కువగా జరుగుతున్నాయి అందులో కొత్తెమి లేదు అని కామెంట్లు కూడా వస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news