ఫిలిం ఇండస్ట్రీలో నటీనటులు ఎప్పుడు .. ఎలాంటి స్థాయికి చేరుకుంటారో చెప్పడం కష్టం. ముఖ్యంగా మన పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవారు కదా ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అని.. అయితే ఈ సామెత సినిమా వాళ్లకు బాగా సెట్ అవుతుందని చెప్పవచ్చు. ఒకప్పుడు ఉన్నతంగా బతికిన వాళ్ళు చివరి క్షణాలలో ఏమీ లేకుండా అనాధలుగా చనిపోతూ ఉంటారు. కొంతమంది చివరకు వచ్చినప్పుడు చాలా కష్టాలు పడి ఆ తర్వాత ఉన్నతంగా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక పోతే కొంతమంది అవకాశం ఇచ్చిన వారిని దేవుళ్ళుగా చూస్తే మరికొంతమంది వారికి పాఠాలు చెబుతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ రాజనాల కూడా ఒకరు.రాజనాల కేవలం నటుడు మాత్రమే కాదు ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలకు దీటుగా విలన్ పాత్రలు పోషిస్తూ ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు. ఇక హీరోలతో సమానంగా పారితోషకం అందుకున్న ఏకైక నటుడు మాత్రమే కాదు హాలీవుడ్ సినిమాలలో నటించిన మొట్టమొదటి తెలుగు నటుడు కూడా రాజనాలే కావడం గమనార్హం. పూర్వకాలంలో ఒక సారి రాజనాల ఒక సినిమా సమయంలో వీర కొండల రావు ద్రోణాచార్యుడు వేషం వేస్తే రాజనాల దుర్యోధనుడు వేషం వేశాడు. ఇక ఆ సమయంలో ద్రోణాచార్యుడు కాళ్లు కడిగి దుర్యోధనుడు ఆ నీళ్ళ ను నెత్తిమీద చల్లుకోవాలి.. ఆ సీన్ చేయడానికీ రాజనాల ఒప్పుకోలేదు. డూప్ ని పెడితే బాగుంటుందని దర్శకుడు సలహా ఇచ్చాడట. అలాగే సీన్ ఉంటుందని చేయక పోతే ఇంకో దుర్యోధనుడిని వెతుక్కోవాల్సి వస్తోంది అని చెప్పడంతో రాజనాల చివరికి వెనక్కి తగ్గి ఆ సీన్ చేశారట. తర్వాత ఆయనకు అవకాశాలు తగ్గి పోవడం ఆస్తులు కూడా కరిగిపోయి దీన స్థితికి చేరుకున్నారు రాజనాల.
ఏదైనా వేషం కావాలంటూ కొండలరావు దగ్గరికి వచ్చారట. ఈ క్రమంలోనే ఒక సినిమాలో ముసలి తండ్రి పాత్రను కొండలరావు చేయాల్సి ఉండగా.. ఆ పాత్రను చిత్రబృందం తో మాట్లాడి ఆయనకు వచ్చేలా చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకనిర్మాతలకు తలనొప్పి తెప్పించారట. సీనియర్ కాబట్టి ఏ సీన్ ఎలా తీయాలో అనేది దర్శకులకు రాజనాల ఎక్కువగా వివరించడం జరిగింది. ఇక దర్శకుడు వెంటనే కొండల రావు కి ఫోన్ చేసి ఈయనను మాకు తగిలించారు ఏంటి అని అడిగితే ఏం చేయలేము ఆయన సీనియర్ కదా కొన్నాళ్లపాటు భరించక తప్పదని షూటింగ్ పూర్తి చేశారు.