మగ బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ హీరోయిన్

-

సంజనా గల్రాని బుజ్జిగాడు, సత్యమేవజయతే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ హీరోయిన్. ఇటీవలే గ్రాండ్ గా సీమంతం జరుపుకున్న ఆమె తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన మహిళా డాక్టర్ సోషల్ మీడియాలో వెల్లడించింది.” బాబు పుట్టాడు.. కంగ్రాచ్యులేషన్స్” అన్న క్యాప్షన్ ను జోడిస్తూ సంజనా తో దిగిన ఫోటోను నెట్టింట్లో షేర్ చేసింది. మరోవైపు సంజన చెల్లి నిక్కి గల్రాని పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది.

మే 18న ఆమె హీరో ఆది పినిశెట్టి ని పెళ్లి చేసుకుంది. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ గుడ్ న్యూస్ చెప్పడంతో ఫ్యాన్స్ ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కాగా బిగ్ బాస్ కన్నడ మాజీ కంటెస్టెంట్ అయిన సంజన శాండిల్ వుడ్ డ్రగ్స్ కాంగ్రెస్ అరెస్టయి మూడు నెలలు జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే.బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత ప్రియుడు అజీజ్ పాషా ను పెళ్లి చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news