రోజూకో ఫ్రూట్ తింటే ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది అంటారు వైద్యులు. కొన్ని ఫలాలు సీజన్ బట్టే వస్తుంటాయి. అందులో ఒకటి ఇప్పుడు మనం చెప్పుకునే పైనాపిల్. అనాసపండుని ఇష్టపడనివాళ్లు కూడా కొందరు ఉంటారు. కానీ మీకు తెలుసా ఇది తినటం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో..చూడ్డానికే మంచి లుక్ ఉంటుంది పైనాపిల్. ఇంక తినటానికి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. పొటాషియం, సోడియం నిల్వలో ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఈరోజుల్లో కామన్ గా వచ్చే ఒత్తిడి, ఆందోళన సమస్యను ఇది తగ్గిస్తుందట. అంతేకాదు, డయాబెటీస్, హృదయసంబంధ వ్యాదులు, క్యాన్సర్ కారకాలైనా ఫ్రీ రాడికల్స్ తో ఇది పోరాడుతుంది. జీర్ణక్రియకి కూడా అనాస పండు అద్భుతంగా పనిచేస్తుంది. ఆరోగ్యమేకాదు అందానికి కూడా పైనాపిల్ ఉపయోగపడుతుందని మీకు తెలుసా..చర్మనిగారింపును పెంచే ఎంజైమ్ లు ఇందులో ఉన్నాయట. ఇలా చెప్పుకుంటూ పోతే.ఎన్నో ఉన్నాయి..ఆరోగ్యపరంగా పైనాపిల్ ఎంత మంచి ఫలమో ఇప్పుడు చూద్దాం.
అనాసపండులో ఆరోగ్యప్రయోజనాలు:
• అనాస జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది.
• విపరీతమైన వాంతులతో బాధపడేవారు పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల త్వరగా వాటి నుంచి విముక్తి పొందవచ్చు.
• అనాసలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉండటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.
• అనాస అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
• ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.
• మధుమేహం, గుండె పోటు సమస్యలు, దంతాల సమస్యలతో బాధపడేవారు అనాస మంచి ఔషధంగా పనిచేస్తుంది.
• పైనాపిల్ వికారాన్ని తగ్గిస్తుంది
• జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాస రసం దివ్య ఔషధం.
• పైనాపిల్ తిన్నవారి చర్మం మృదువుగా ఉంటుందని నిపుణులు చెప్పారు.
• పైనాపిల్ జీర్ణక్రియ ప్రచారంలో సహాయపడుతుంది.
• అనాసలో ఉండే బ్రొమిలైన్ అనే ఎంజైమ్ క్యాన్సర్ పేషెంట్లలో కలిగే దుష్ప్రభావాలను దూరం చేస్తుంది. ఇటీవల పరిశోధనలలో భాగంగా పైనాపిల్ లోని బీటా-కెరోటిన్.. ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి రక్షిస్తుందని వెల్లడయింది.
• పూర్తిగా పండని అనాస రసం తీసు కుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
• పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది.
• బాగా పండిన పైనాపిల్ ను రోజూ తినడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని సంప్రదాయ వైద్యులు బెబుతున్నారు.
గర్భవతులు అనాస పండుకి దూరంగా ఉండడం మంచిది. ప్రెగ్నెంట్ సమయంలో ఫైనాపిల్ తింటే గర్భం పోయే ఛాన్స్ ఉంది. అయితే డెలివరి సమయంలో తింటే నొప్పులు తక్కువగా వస్తాయని వైద్యులు అంటుంటారు.
చూశారుకదా..పైనాపిల్ లో ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయో..ఈ సీజన్ లో విరివిగా దొరుకుతుంది కాబట్టి మీరు తినటానికి ట్రై చేయండి.