ప్రముఖ నటుడు, రెబల్ స్టార్, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు ఇక లేరన్న వార్త అభిమానులను కలచివేసింది. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కృష్ణంరాజు చివరి శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చివరి చూపు కోసం ప్రజలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. సోమవారం మధ్యాహ్నము అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులతోపాటు పలువురు నేతలు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కృష్ణంరాజు మరణం పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ” కృష్ణంరాజుని కోల్పోవడం బాదేసింది. ఆయన నటన ఎప్పటికీ మరిచిపోలేనిది. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాలలోకి వచ్చారు. సినీ ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయనకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన లెగసి ఎప్పటికీ ఉంటుంది.ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా ఉండాలి. ఇది చాలా విషాద సమయం. ఇప్పుడే ప్రభాస్ ని కలిశాను. ప్రభాస్ ధైర్యంగా ఉండాలి. కృష్ణంరాజు లేని లోటు.. ప్రభాస్ తీర్చాలి అని కోరుతున్న”. అన్నారు నారా చంద్రబాబు.