హైదరాబాద్ లో తొలి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసు నమోదు..మరికొన్ని నగరాలకు పాకే అవకాశం

-

కరోనా కథ ముగిసింది అనుకుంటున్న వేళ ఆందోళన కలిగించే మరో విషయం వెలుగులోకి వచ్చింది. వివిధ దేశాల్లో కోవిడ్ ఉదృతికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వెరియేంట్ అయిన ‘బీఏ4 ‘ తాజాగా హైదరాబాదులో వెలుగులోకి వచ్చింది. ఈనెల 9వ తేదీన ఈ కేసు నమోదైంది. ఈ వేరియంట్ కేసు నమోదు కావడం దేశంలోనే ఇది తొలిసారి. ఇది మరిన్ని నగరాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధనా మండలి( ఐసీఎంఆర్) పేర్కొంది.

కరోనా బారిన పడిన వారికి ఇప్పటికే రెండు దోసులు తీసుకున్న వారికి కూడా ఇది సోకుతున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. ఇది ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత ప్రమాదకారి కాదు..కానీ వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక విభాగం చీఫ్ మారియా వాన్ పేర్కొన్నారు. భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే వ్యాపించడం, దీనికి తోడు వాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా జరగడం వల్ల తాజా వేరియంట్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాధితులు ఆసుపత్రిలో చేరే పరిస్థితులు దాదాపు ఉండవని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news