దేశంలోనే తొలి ‘వర్చువల్ స్కూల్’ ప్రారంభం.. పాఠశాల ప్రత్యేకతలివే!

-

దేశంలోనే తొలి వర్చువల్ స్కూల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి మరో ముందడుగు వేశారు. భౌతికంగా పాఠశాలలకు వెళ్లలేని వారి కోసం ఈ స్కూల్ ఎంతో ఉపయోగకరం కానుంది. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు అనుసంధానంగా ఈ పాఠశాల అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. అలాగే ఈ పాఠశాలలో ప్రత్యేకమైన కోర్సులు కూడా అందించనున్నారు.

అరవింద్ కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్

జేఈఈ, నీట్, సీయూఈటీ పరీక్షలకు కూడా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘దేశంలోనే తొలి వర్చువల్ పాఠశాలను ప్రారంభించాం. 9-12వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. దేశంలో ఏ విద్యార్థి అయినా ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్, జేఈఈ, సీయూఈటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాం. పలు కారణాల వల్ల బడికి రాలేని విద్యార్థుల కోసం ఈ స్కూల్ ఉపయోగపడుతుంది.’ అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news