BREAKING : ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. ఢిల్లీలో థియేటర్లు మూసివేత

-

ఢిల్లీ లోని కేజ్రీవాల్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్‌ దెబ్బకు.. ఢిల్లీలో థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది కేజ్రీవాల్‌ సర్కార్‌. సినిమా హాళ్ల తో పాటు.. షాపింగ్‌ మాల్స్‌, జిమ్‌లు, మల్టీప్లెక్స్‌లు, బాంకెట్ హాల్స్, ఆడిటోరియంలు & స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు తక్షణమే మూసి వేయలని కేజ్రీవాల్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది.

అలాగే.. మెట్రో, రెస్టారెంట్లు, బార్‌లు 50% సామర్థ్యంతో నడిపించాలని కేజ్రీవాల్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ తాజాగా ఆదేశాలు ఇవాళ అర్థరాత్రి నుంచే అమలు కానున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఇక అటు ఢిల్లీ వ్యాప్తంగా… నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతుందని.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ ఉంటుందని సీఎం కేజ్రీవాల్‌ ప్రకటన చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూల్స్‌ ను ప్రతి ఒక్కరూ తుచా తప్పకుండా పాటించాలని.. ఎవరైనా ఈ రూల్స్‌ ను అతి క్రమిస్తే.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు సీఎం కేజ్రీవాల్‌. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version