ఏపి లో సరికొత్త పుస్తకం.. ఒకే సారి ఇంగ్లీష్, తెలుగు

-

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం మొదలు పెట్టాలి అని నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఈ విధానాన్ని ప్రజలు స్వీకరించిన అప్పటి కి ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. అనేక ధర్నాలు , తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో ట్విట్టర్ వేదికగా స్పందించే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆంధ్ర వస్తున్న సరికొత్త పుస్తకాల గురించి ట్వీట్ చేశారు. తొందరలోనే ఇవి అందుబాటులో కి వస్తాయని తెలిపారు.

ఈ పుస్తకాలు ఒక వైపు తెలుగు మరోవైపు ఇంగ్లీష్ ఉంటాయి అని.. ఒకే సారి రెండు భాషలలో విద్యార్థులు చదివే సౌలభ్యం కల్పిస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు.ఈ సరికొత్త పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తుందని అన్నారు.రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయాలని స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు ఏపీ వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. స్టాండింగ్ కమిటీ నుంచి కూడా తొలగించాలని కోరినట్లు విజయసాయిరెడ్డి అన్నారు. ఇప్పుడు అధికార పార్టీ కి పెద్ద తలనొప్పిగా రఘురామకృష్ణరాజు తయారు అయ్యారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news