వైకాపా నేతలు విమర్శలు చేస్తున్నారు.. కొంతమంది ఆన్ లైన్ లో ట్రోల్ చేస్తున్నారు.. చినబాబు పద ఉచ్చారణలపై సెటైర్లు వేస్తున్నారు ఇవన్నీ… పొలిటికల్ ట్రోల్ అని సరిపెట్టుకున్న తమ్ముళ్లకు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ వచ్చి పడింది!
ఇంతకాలం లోకేష్ అసమర్ధుడు, నాయకత్వ లక్షణాలు ఏమాత్రంలేని వ్యక్తి, పుత్రుడి టాలెంట్ తెలిసే ఆ దారిలో మంత్రిని చేయాల్సిన పరిస్థితి చంద్రబాబుకు వచ్చింది.. అని ఇంతకాలం లోకేష్ గురించి జరుగుతున్న చర్చలు, వినిపిస్తోన్న విమర్శలు నేడు మరీ పీక్స్ కి వెళ్లిపోతున్నాయి. చినబాబు సమర్ధత మీద, లేదా చినబాబు ను పార్టీలో ఎవరెవరు నాయకుడిగా కోరుకుంటున్నారనే విషయం మీద బ్యాలెట్ పెట్టమనే స్థాయివరకూ పరిస్థితి వచ్చిందంటే అర్ధం చేసుకోవాలి!
ఇప్పుడు చినబాబుకు మరో మార్గం లేదు! పూర్తిగా రాజకీయాలనుంచి తప్పుకుని వ్యాపారాలు గట్రా చేసుకోవడం. లేదా… తానేంటో, తన స్థాయేమిటో, తన కెపాసిటీ రేంజ్ ఏమిటో నిరూపించుకోవడం! చినబాబు ఆ ధైర్యం చేస్తారా.. ఆ రేంజ్ ఆలోచనలు చేసి అవి కార్యరూపం దాల్చే సాహసం చినబాబు చేస్తారా? జనాల్లోకి వస్తారా? జనాల సంగతి దేవుడెరుగు.. కనీసం పార్టీలో ఉన్న నాయకులతో అయినా శభాష్ అనిపించుకుంటారా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది!
అవును… సమయం లేదు చినబాబూ… నిన్న మంగళగిరి జనాలు, నేడు టీడీపీ మాజీ నేతలు… రేపు…??? అంతా చినబాబు అసమర్ధను గుర్తించేవారే అయిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో లోకేష్ చేయాల్సింది ఒకటే ఒకటి… జనాల్లోకి రావడం, నాయకులను కలుపుకుపోతూ, తనలో కూడా ఒక నాయకుడు ఉన్నాడని నిరూపించుకోవడం. మరి ఆ దిశగా చినబాబు అడుగులు వేస్తారా? సమయం లేదు చినబాబూ…!!