ఆ చెట్టును చూడాలంటే.. రిజ్వరేషన్ ఉండాలట. .అయినా మూడు నాలుగు గంటలు నిరీక్షించాల్సిందే..!

-

చలికాలంలో కొన్ని చెట్లు ఆకులు రాలిపోయి..కొత్త పూత వస్తుంది. అలా రాలిన ఆకులు చెట్టు కింద ఉంటే..కలర్‌ఫుల్‌గా బాగుంటుంది కదూ. చైనాలోని గునియిన్‌ గుమియవోలోని ఓ ఆలయంలో చెట్టు కూడా ఆకులు రాల్చుతూ..చూసేందుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే..ఆ చెట్టును చూడటానికి..రిజర్వేషన్‌ చేయించుకోవాలంట. చెట్టును చూడ్డానికి రిజ్వరేషన్‌ ఏంట్రా అనేగా మీ డౌట్. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.

చైనాటౌన్‌లోని షాంగ్జీ ప్రావిన్స్‌లోని జోంగ్‌నాన్‌ పర్వతాల ప్రాంతంలో గునియిన్‌ గుమియవో అనే బౌద్ధుల ఆలయం ఉంది. ఆ ప్రావిన్స్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇదీ ఒకటి. ఈ ఆలయంలో ఉన్న గింగ్‌కొ బిలోబా అనే చెట్టు పర్యటకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ రకం చెట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా ఈ ఆలయంలోని చెట్టు మాత్రం చాలా ప్రాచీనమైనదవడంతో..ఈ చెట్టుకు అంత ప్రాముఖ్యత దక్కింది.

ఈ చెట్టు 1400 సంవత్సరాల కిందటిదని, 618-907 మధ్య ఉన్న టాంగ్‌ రాజ్యాన్ని పరిపాలించిన లి షిమిన్‌ దీన్ని నాటినట్టు చరిత్రకారులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన చెట్టుగానూ దీనికి పేరుంది. ఆకుపచ్చగా ఉండే ఈ చెట్టు ఆకులు శరదృతువులో బంగారువర్ణంలోకి మారి రాలిపోతాయి…ఆ ఆకులన్నీ నేలపై పడుతుంటే ఆ సుందరదృశ్యం చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. ప్రకృతి ప్రేమికులకతై..కన్నులపండుగే.

నేలంతా బంగారువర్ణంలో చూడచక్కగా ఉంటుంది. నిజానికి, శరదృతువు ప్రారంభంలో ఈ చెట్టు వద్ద స్థానికులు మాత్రమే వేడుకలు నిర్వహించేవారు. కొన్నాళ్ల కిందట ఈ చెట్టు అందాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దేశవిదేశాల నుంచి పర్యటకుల రాక మొదలైంది. సాధారణ రోజుల్లో భక్తులు, పర్యటకులు తక్కువగానే ఉన్నా.. అక్టోబర్‌ నెలఖారు నుంచి డిసెంబర్‌ వరకు కనీసం 60వేల మంది పర్యటకులు ఈ చెట్టును సందర్శిస్తున్నారని అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఇక అంత మంది పర్యటకులు ఒకేసారి రావడంతో.. రోజుకు ఏడు నుంచి ఎనిమిది వేల మందినే అనుమతించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పర్యటకులు ఈ చెట్టును సందర్శించడం కోసం ముందుగానే అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు సూచిస్తున్నారు. అలా రిజర్వేషన్‌ చేసుకొని వచ్చినా.. మూడు నుంచి నాలుగు గంటలు క్యూలో నిలబడితేనే ఆ చెట్టు దర్శన భాగ్యం కలుగుతోందట. వింటానికి మరీ విచిత్రంగా జనాలు అంత టైం వెయిట్‌ చేసి మరీ చూస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా విదేశీ పర్యటకులు సంఖ్య తక్కువగానే ఉన్నా.. దేశీయ పర్యటకులు మాత్రం ఈ చెట్టును చూడటానికి వస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news