ఇంట్లోనే రోజ్ వాట‌ర్ తయారీ బిజినెస్‌.. మహిళలకు సువర్ణావకాశం..!

-

రోజ్ వాట‌ర్‌ను సాధార‌ణంగా సౌంద‌ర్య‌సాధ‌న ఉత్ప‌త్తుల్లో వాడుతార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ వాట‌ర్‌ను బ‌య‌ట విడిగా కూడా విక్ర‌యిస్తారు. దీన్ని బ్యూటీ పార్ల‌ర్ల వారు ఎక్కువ‌గా వాడుతారు. మ‌హిళ‌లు త‌మ ముఖ సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌డం కోసం రోజ్ వాట‌ర్‌ను ఉప‌యోగిస్తుంటారు. ఇక ఆయుర్వేద కంపెనీలు ప‌లు ఔష‌ధాల త‌యారీలోనూ రోజ్ వాట‌ర్‌ను వాడుతాయి. అయితే ఈ రోజ్ వాట‌ర్‌ను ఎవ‌రైనా స‌రే.. ఇంట్లోనే త‌యారు చేసి విక్ర‌యించ‌వ‌చ్చు. దీంతో నెల నెలా చ‌క్క‌ని సంపాద‌న పొంద‌వ‌చ్చు. మ‌రి రోజ్ వాట‌ర్ త‌యారీ బిజినెస్‌కు ఏమేం కావాలో, ఇందులో ఏ మేర‌ లాభాలు ఉంటాయో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

make rose water at home and sell it for good income

రోజ్ వాట‌ర్ త‌యారీ కోసం షాపును తీసుకోవాల్సిన ప‌నిలేదు. ఇంట్లోనే చేయ‌వ‌చ్చు. దీనికి కావ‌ల్సింద‌ల్లా రోజ్ పెట‌ల్స్ (గులాబీ పూల రెక్క‌లు), డిస్టిల్ వాట‌ర్‌, గ్యాస్ క‌నెక్ష‌న్ ఉంటే చాలు. అలాగే త‌యారు చేసిన రోజ్ వాట‌ర్‌ను ప్యాక్ చేసి విక్ర‌యించేందుకు 50, 100, 250 ఎంఎల్ సైజుల్లో ఉండే బాటిల్స్ కావాలి. ఇక వాటిని ప్యాక్ చేసేందుకు కార్ట‌న్స్ ఉండాలి.

రోజ్‌వాట‌ర్‌ను సాధార‌ణంగా ప‌రిశ్ర‌మ‌ల్లో అయితే స్టీమ్ డిస్టిలేష‌న్ అనే ప్ర‌క్రియ ద్వారా త‌యారు చేస్తారు. కానీ ఇండ్ల‌లో రోజ్ పెట‌ల్స్‌ను నీటిలో మ‌రిగించి త‌యారు చేయ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో 1 కిలో రోజ్ పెట‌ల్స్ ద్వారా 10 లీట‌ర్ల రోజ్ వాట‌ర్ త‌యారు చేయ‌వ‌చ్చు. ఇందుకు 3 గంట‌ల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంది. ఇక ఇలా త‌యారైన రోజ్ వాట‌ర్‌ను భిన్న ర‌కాల సైజుల్లో ఉండే బాటిల్స్‌లో నింపి అనంత‌రం ఆ బాటిల్స్‌ను కార్ట‌న్స్‌లో ప్యాక్ చేసి విక్ర‌యించాలి.

ఇక మార్కెట్‌లో ఒక్క 250 ఎంఎల్ రోజ్ వాట‌ర్ బాటిల్ ధ‌ర రూ.45గా ఉంది. 10 లీట‌ర్ల రోజ్‌వాట‌ర్‌తో 250 ఎంఎల్ సైజు ఉన్న‌వి 40 బాటిల్స్ త‌యార‌వుతాయి. ఈ క్ర‌మంలో ఒక్కోదాన్ని రూ.45కు విక్ర‌యిస్తే.. 40 బాటిల్స్‌కు రూ.1800 అవుతుంది. ఇందులోంచి రూ.500 ఖ‌ర్చులు, రూ.300 రిటెయిల‌ర్ మార్జిన్ తీసేస్తే.. రూ.1000 అవుతుంది. ఇక నిత్యం రూ.1వేయితో నెల‌కు రూ.30వేల వ‌ర‌కు ఈ బిజినెస్‌లో సంపాదించుకోవ‌చ్చు. అయితే ఇంకా ఎక్కువ స‌మ‌యం క‌ష్ట‌ప‌డుతాం అనుకుంటే ఇంకా ఎక్కువ ప‌నిచేసి ఎక్కువ మొత్తంలో రోజ్ వాట‌ర్‌ను త‌యారు చేసి విక్ర‌యించ‌వ‌చ్చు.

త‌యారు చేసిన రోజ్ వాట‌ర్‌ను బాగా స‌ప్లై చేసి మంచి లాభాలు రావాలంటే.. చాలా మందితో టై అప్ అవ్వాల్సి ఉంటుంది. సాధార‌ణంగా రోజ్ వాట‌ర్‌ను బ్యూటీ పార్ల‌ర్లు, ఆయుర్వేద కంపెనీలు, కాస్మొటెక్ త‌యారీ కంపెనీలు, ఫ్యాన్సీ స్టోర్లు, బార్లు, రెస్టారెంట్లు, సూప‌ర్ మార్కెట్లు, కిరాణా స్టోర్లు త‌దిత‌ర వ్యాపారుల‌కు విక్ర‌యించ‌వ‌చ్చు. అందుకు గాను వారితో టై అప్ అవ్వాలి. వారికి కావ‌ల్సిన మార్జిన్ వారికి ఇస్తే.. ఈ బిజినెస్ నిరాటంకంగా కొన‌సాగుతుంది. దీంతో త‌క్కువ కాలంలోనే ఈ బిజినెస్ ద్వారా ఎక్కువ లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news