పిల్లలు పుట్టడం లేదని కోడలికి మృతదేహం ఎముకల పొడిని తినిపించిన అత్తమామ..

-

కాలాలు మారినా.. మనుషుల్లో మూఢనమ్మకాలు మాత్రం అలానే ఉన్నాయి.. ఓవైపు 5జీ టెక్నాలజీ వచ్చేసింది..కానీ ఇంకా కొంతమంది.. ఆధారాలు లేని వాటిని ఇంకా బలంగా నమ్ముతున్నారు. పిల్లలు పుట్టకపోతే ఆరోగ్యపరంగా ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోని చికిత్స చేసుకోవాలి కానీ.. ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా అనిపిస్తుంది. తాంత్రికుడు చెప్పాడని.. అత్తమామలు, భర్త..ఆ మహిళను వివిధ శ్మశానాలకు తీసుకెళ్లి.. అక్కడ ఉన్న ఎముకలు, వాటి పొడిని తినిపించారట.. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
పుణెలో నివాసముంటున్న ఓ మహిళకు 2019లో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆ దంపతులకు పిల్లలు కలగలేదు.. అత్తమామలకు భయం మొదలైంది. ఈ క్రమంలోనే వారు ఓ తాంత్రికుడిని కలిశారు.. అతను చెప్పినట్టు చేశారు. అనేక అమావాస్య సమయాల్లో.. ఇంట్లో మహిళ చేత విచిత్ర పూజలు చేయించారు ఆమె కుటుంబసభ్యులు. అంతేకాకుండా.. వివిధ శ్మశానవాటికలకు తీసుకెళ్లేవారట… మరణించిన మనుషుల ఎముకలను తనిపించేవారట.. ఎముకల పొడిని సైతం బాధితురాలి నోట్లో బలవంతంగా పెట్టేవారు..ఇలా ఎన్నోసార్లు చేశారు.. అన్ని సందర్భాల్లోనూ.. ఆ తాంత్రికుడు వీడియో కాల్, ఫోన్​ కాల్​​లో సూచనలు ఇస్తూ ఉండేవాడు.. ఇంకొన్ని సందర్భాల్లో మహిళను ఓ జలపాతం వద్దకు తీసుకెళ్లి.. అఘోరీలు చేసే పనులు చేయించేవారట.. ఛీ ఇదంతా వింటుంటేనే.. మనుషులు ఇంత ఘోరంగా ఉంటారా అనిపిస్తుంది కదూ..! పిల్లలు పుట్టకపోతే ఎన్ని మార్గాలు ఉన్నాయి.. ఇవన్నీ చేసేబదులు టెక్నాలజీని వాడుకోవచ్చు కదా..!
అత్తమామలు, భర్త వేధింపులు తట్టుకోలేక పోయిన బాధితురాలు.. చివరికి పోలీసులను ఆశ్రయించింది. బ్లాక్​ మేజిక్​తో పాటు అత్తమామలపై వేధింపుల కేసు కూడా వేసింది. కట్నం కింద నగదు, బంగారం, వెండి ఆభరణాలను డిమాండ్​ చేస్తున్నారని పేర్కొంది. ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. ఏడుగురిపై సెక్షన్​ 498 ఏ, 323, 504, 506తో పాటు యాంటీ సూపర్​స్టీషన్​ యాక్ట్​లోని 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఆ శ్మశానాలు ఎక్కడ ఉన్నాయనేది బాధితురాలికి తెలియదు. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా వాటిని వెతకడం మొదలుపెట్టాము. నిందితులను అతిత్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.. ఈ ఘటనపై ఏసీపీ స్థాయి పోలీసు అధికారి దర్యాప్తు చేపడతారని నేను హామీనిస్తున్నా,” అని డీసీపీ శర్మ తెలిపారు. నిందితులు బాగా చదువుకున్నవారేనట.. అయినప్పటికీ ఇలాంటివి ఇంత గుడ్డిగా నమ్మడం ఏంటో..!

Read more RELATED
Recommended to you

Latest news