CCC : ఫిబ్రవరి 26న సినిమా స్టార్స్ క్రికెట్‌ పోటీ

-

ప్రతి ఏటా జరిగే ‘క్రెసెంట్‌ క్రికెట్‌ కప్‌’ (సీసీసీ) పోటీలు ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తెలుగు, హిందీ సినీ నటులు తలపడే ఈ పోటీల్లో ఈ ఏడాది ‘సే నో టు డ్రగ్స్‌’ అంశంపై చైతన్యం తీసుకొస్తామన్నారు. బంజారాహిల్స్‌లోని హోటల్‌ హ్యత్‌ప్లేస్‌లో ఆదివారం హోంమంత్రి మహమూద్‌ అలీ, సినీమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ విడివిడిగా పాల్గొన్నారు.

ఎమ్మెల్యే బాలరాజుతో కలిసి క్రికెట్‌ కప్‌, పోటీల బ్రోచర్‌ను మంత్రులు ఆవిష్కరించారు. సెంట్రల్‌జోన్‌ డీసీపీ రాజేష్‌ చంద్ర,  పోటీల నిర్వాహకులు షకీల్‌ సఫీ మాట్లాడారు. కార్యక్రమంలో బాలీవుడ్‌ జట్టు కెప్టెన్‌ అర్బాజ్‌ ఖాన్‌, బిగ్‌బాస్‌6 విజేత రేవంత్‌, తెలుగు సినీనటులు రాజ్‌ తరుణ్‌, వరుణ్‌ సందేశ్‌, తనీష్‌, ఖయ్యూం, రవి ప్రకాష్‌, శ్రావణ్‌, వీజే సన్నీ, షఫీ, అమిత్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news