సామాన్యులకు RBI బిగ్ షాక్ ఇచ్చింది. సామాన్యులకు షాక్ ఇచ్చేలా.. వడ్డీ రేట్లను భారీగా పెంచేసింది ఆర్బీఐ. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్. రెపోరేటుపై మరో 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో.. గతంలో 4.40 శాతం గా ఉన్నటు వంటి రెపోరేటు 4.90 శాతానికి పెరిగి పోయింది.
దీని ఫలితంగా హోం లోన్లు, పర్సనల్ లోన్లు, కార్ల రుణాల వడ్డీ పెరుగనుంది. ఇది సామాన్యులకు భారమనే చెప్పాలి. అటు SDF రేటు 4. 65 శాతానికి సవరించింది ఆర్బీఐ. mdf రేటు 5.15 శాతంగా ఉంది.
సాధారణ రుతుపవనాల ఊహతో, 2022లో మరియు బ్యారెల్‌కు భారత బుట్టలో సగటు ముడి చమురు ధర 105 డాలర్లు, ద్రవ్యోల్బణం ఇప్పుడు 2022-23లో 6.7%గా అంచనా వేయబడిందని చెప్పారు RBI గవర్నర్ శక్తికాంత దాస్. ఆర్బీఐ నిర్ణయం ప్రకారం.. హోం, కార్, పర్సనల్ లోన్ లు మరింత భారం కానున్నాయి.
The MPC voted unanimously to increase the policy repo rate by 50 bps to 4.90%: RBI Governor Shaktikanta Das pic.twitter.com/KS8RswFIEy
— ANI (@ANI) June 8, 2022