భాగ్యనగరంలో హారన్ల మోత.. ట్రాఫిక్‌ పోలీసుల కీలక నిర్ణయం..

-

రోజు రోజుకు హైదరాబాద్‌ నగరంలో వాహనాల వాడకం సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే.. వాయు కాలుష్యంతో పాటు శ‌బ్ధ కాలుష్యం కూడా పెరిగిపోతోంది. వాయు కాలుష్యం త‌గ్గించేందుకు చేప‌డుతున్న చ‌ర్య‌లు ఓ మోస్త‌రు ఫ‌లితం ఇస్తున్నా.. శ‌బ్ధ కాలుష్యం త‌గ్గించ‌డంలో మాత్రం అనుకున్న మేర ఫ‌లితాలు రావ‌డం లేదు. దీంతో న‌గ‌ర ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం ఇప్పుడు కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌లులోకి తీసుకువ‌చ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నిబంధ‌న‌లు మ‌రో నెల‌లోనే అందుబాటులోకి రానున్న‌ట్లు న‌గ‌ర ట్రాఫిక్ పోలీస్ చీఫ్ ఏవీ రంగ‌నాథ్ చెబుతున్నారు. ఈ కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం అన‌వస‌రంగా హార‌న్‌ కొట్టే వారిని అత్యాధునిక కెమెరాల సాయంతో పోలీసులు గుర్తించ‌నున్నారు.

5 Reasons Turks Use Their Car Horn

అన‌వ‌స‌ర హార‌న్ మోతాదును బ‌ట్టి వాహ‌న‌దారుడిపై చ‌ర్య‌లు తీసుకుంటారు. ఈ చ‌ర్య‌ల కింద జ‌రిమానాలు, భారీ జ‌రిమానాలు విధించ‌డంతో పాటు ఏకంగా వాహ‌న‌దారులను కోర్టులో హాజ‌రుప‌రిచే దాకా శిక్ష‌లు ఉన్నాయి. ఈ మేర‌కు మోటారు వాహ‌నాల చ‌ట్టంలోని 119 సెక్ష‌న్‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news