మార్చిలో అమలులోకి వచ్చే కొత్త రూల్స్…జేబులకు చిల్లు పడటం ఖాయం..

-

కొత్త నెల వస్తే కొత్త రూల్స్ కూడా మారతాయన్న విషయం తెలిసిందే..ఫిబ్రవరి నెలకు, మార్చి నెలకు చాలా రూల్స్ మారాయని నిపుణులు చెబుతున్నారు. మార్చిలో కూడా కొన్ని కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. వాటిలో మీ జేబుకు చిల్లుపెట్టే నియమనిబంధనలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవడం అవసరం. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కొత్త ఛార్జీలు, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు, బ్యాంకుల్లో వడ్డీ రేట్ల పెంపు… ఇలా చాలావరకు నియమనిబంధనలు డబ్బుతో ముడిపడి ఉన్నవే. మరి మార్చిలో అమలులోకి రాబోతున్న కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఆయిల్ కంపెనీలు ప్రతీ నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగొచ్చు. తగ్గొచ్చు. లేదా స్థిరంగా ఉండొచ్చు. మరి ఈసారి ఆయిల్ కంపెనీలు ఏ నిర్ణయం తీసుకుంటాయో మర్చి 1న తెలుస్తుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేట్ 25 బేసిస్ పాయింట్స్ పెంచిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులన్నీ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే తమ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ పెంచుతున్నట్టు ప్రధాన బ్యాంకులు ప్రకటించింది. మార్చి 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి రానున్నాయి. దీంతో సామాన్యులకు రుణాలు భారం కానున్నాయి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు మూడు కంప్లైంట్ అప్పీలేట్ కమిటీలను ఏర్పాటు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మార్చి 1 నుంచి ఈ కమిటీలు పనిచేస్తాయి. సోషల్ మీడియాపై వచ్చే ఫిర్యాదుల్ని కేవలం 30 రోజుల్లో సాల్వ్ చేస్తాయి..

బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన క్రెడిట్ కార్డ్ విభాగం ఎస్‌బీఐ కార్డ్ కొత్త ఛార్జీలను ప్రకటించింది. కొత్త ఛార్జీలు 2023 మార్చి 17 నుంచి అమలులోకి రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఎవరైనా అద్దె చెల్లిస్తే రూ.199 + ట్యాక్సులు చెల్లించాలి.. గతంలో ఉన్నదానికన్నా రెట్టింపు అయ్యింది..

ఇకపోతే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్ ఖాతాదారులు అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇందుకోసం ఈపీఎఫ్ ఖాతాదారులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. తమ దరఖాస్తుల్ని సబ్మిట్ చేయడానికి 2023 మార్చి 3 చివరి తేదీ… పైన తెలిపినవన్ని మార్చి నెలలో మారనున్నాయి..

 

Read more RELATED
Recommended to you

Latest news