టీవీల్లో వచ్చే యాడ్స్‌లో అద్భుతాలను చేసి చూపిస్తారు..ఇలా క్రీమ్ రాయగానే తెల్లగా అయిపోతారు. అలా మురికి బట్టలపై సోప్ పెట్టగానే బట్టలు తెల్లగా మారిపోతాయి. తలనొప్పి టాబ్లెట్ వేసుకుని నీళ్లు తాగే లోపు నొప్పి తగ్గిపోతుంది..ఇక మ్యాగికి ట్యాగ్‌లైన్ రెండు నిమిషాల్లో రెడీ అంటూ చెప్తూ ఉంటారు. కానీ మీరు నిజంగా రెండు నిమిషాల్లో మ్యాగీ చేశారా..? మనం ఇలాంటివి చూస్తాం కానీ పెద్దగా సీరియస్‌గా తీసుకోం.. వాళ్లు చెప్పేది చెప్పనీ అనుకుంటాం.. కానీ ఓ మహిళ మాత్రం నిజంగానే సీరియస్‌గా తీసుకుంది. మూడన్నర నిమిషాల్లో పాస్తా రెడీ ఇచ్చిన కంపెనీ విపరీతంగా ప్రచారం చేసింది. నిజమే అనుకుని చేసిన మహిళకు మడున్నర నిమిషాల్లో కాలేదట.. ఇంకా ఎక్కువ టైం పట్టిందట.. ఇంకేముందు.. పరువు నష్టం దావా వేసింది.. భలే క్రేజీగా ఉంది కదూ..! ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మూడున్నర నిమిషాల్లో పాస్తా సిద్ధమవుతుందని ప్రచారం చేసిన సంస్థపై ఓ మహిళపై పరువు నష్టం దావా వేసింది. మూడున్నర నిమిషాలలో పాస్తా రెడీ కాలేదని సదరు మహిళ నష్టపరిహారం కోసం దావా వేసింది. అమెరికాకు చెందిన క్రాఫ్ట్ హెయిన్స్ అనే ఫుడ్ కంపెనీ తన పాస్తా ఉత్పత్తులు 3.30 నిమిషాల్లో సిద్ధంగా ఉన్నాయని ప్రచారం చేసి పాస్తా విక్రయిస్తోంది.అయితే.. ఫ్లోరిడాలో నివసించే అమండా రామిరేజ్ ఈ పాస్తాను కొనుగోలు చేసి వండింది. కానీ మూడున్నర నిమిషాల్లో రెడీ కాలేదని, చాలా ఎక్కువ సమయం పట్టిందని ఆమె తెలిపింది. దీంతో సహనం కోల్పోయిన మహిళ క్రాఫ్ట్ హెయిన్స్‌పై కోర్టులో కేసు వేసింది. క్రాఫ్ట్ హెయింజ్ పాస్తాను ప్రచారం చేసినట్లుగా మూడున్నర నిమిషాల్లో తయారు చేయలేదని, తప్పుడు ప్రకటనలు మరియు వాగ్దానం చేసిన కంపెనీపై దావా వేసి, పరిహారంగా రూ.40 కోట్లు చెల్లించాలని పేర్కొంది.
ఈ ఫిర్యాదు చాలా చిన్నవిషయమని క్రాఫ్ట్ హెయిన్స్ కంపెనీ అధికారులు వ్యాఖ్యానించగా, దీనిపై చర్యలు తీసుకుంటామని కోర్డు తెలిపింది. నిజానికి ఇది చిన్న విషయం కాదు.. చట్ట ప్రకారం తప్పుడు ప్రకటనలు, తప్పుడు వాగ్దానాలు చేయడం నేరం.. జరగని వాటిని జరుగుతాయి అని చూపించడం ప్రకటనల్లోనే సాధ్యం అవుతుంది. కానీ చాలామంది అవి ఫేక్ అని తెలిసి లైట్ తీసుకుంటారు.. మన నిర్లక్ష్యం వల్లే రాను రాను ప్రకటను మరీ దిగజారిపోతున్నాయి.. వినియోగదరాలకు వారి చట్టాలపై సరైన అవగాహన లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణం అవుతుంది.